Begin typing your search above and press return to search.

అమ్మ మోడీ.. నొప్పి తెలీకుండా ఇంత బాదుడా?

By:  Tupaki Desk   |   24 Aug 2017 4:24 AM GMT
అమ్మ మోడీ.. నొప్పి తెలీకుండా ఇంత బాదుడా?
X
ఏది ఏమైనా మోడీ ది గ్రేట్ అనాల్సిందే. జ‌నాల జేబుల్లో నుంచి తెలివిగా డ‌బ్బులు లాగేయ‌టం మోడీకి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. ప‌న్నుల విధానాన్ని స‌మూలంగా మార్చేస్తున్నామంటూ జీఎస్టీని తెర మీద‌కు తీసుకొచ్చిన ఆయ‌న‌.. ఎందుకు ర‌క‌ర‌కాల ప‌న్నులు క‌డ‌తారు? సింఫుల్ గా సింగిల్ ప‌న్ను క‌ట్టండంటూ జీఎస్టీ బొమ్మ‌ను స‌రికొత్తగా తీసుకొచ్చారు. ప‌న్ను ఏదైనా ప్ర‌భుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకే అయినా.. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయేలా జ‌నాల్ని మ‌రిపించిన.. మురిపించిన మోడీ దెబ్బ‌కు.. కేకులు క‌ట్ చేసి మ‌రీ.. ప‌న్నుపోటుకు వెల్ కం చెప్పారు దేశ ప్ర‌జ‌లు.

జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చాక కానీ.. దాని తీవ్ర‌త ఏ స్థాయిలో ఉంటుందో జ‌నాల‌కు అర్థ‌మైంది. కుయ్యో.. మెర్రో అన‌ట‌మే కానీ ఏమీ మాట్లాడ‌లేని ప‌రిస్థితి. జీఎస్టీ వ‌స్తే చాలు.. బ్లాక్ మార్కెట్ అంతు చూస్తామ‌ని బీరాలు ప‌లికిన‌ప్ప‌టికీ.. ఎప్ప‌టిలానే జీఎస్టీ వ‌చ్చాక సైతం నెంబ‌ర్ టూ దందా అదే తీరులో కొన‌సాగుతోంది. జీఎస్టీ ముచ్చ‌ట‌ను ప‌క్క‌న పెడితే.. పెట్రోల్‌.. డీజిల్ బాదుడు విష‌యంలోనూ మోడీ మార్క్ అదిరిపోయింద‌ని చెప్పాలి.

నొప్పి తెలీకుండా బాదేస్తున్న మోడీ తెలివిని చూస్తే షాక్ తినాల్సిందే. పెట్రోల్.. డీజిల్ మీద గ‌తంలో అప్పుడ‌ప్పుడు పెంచ‌టం..త‌గ్గించ‌టం చేసేవారు. త‌ర్వాతి కాలంలో ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కోసారి అంత‌ర్జాతీయ‌ ప‌రిణామాల్ని దృష్టిలో పెట్టుకొని రేటు త‌గ్గించ‌ట‌మా? పెంచ‌ట‌మా అని చేసే వారు. దీంతో.. నెల‌కు రెండుసార్లు పెట్రోల్ హెచ్చుత‌గ్గుల గురించి ప్ర‌జ‌లు ఆలోచించేవారు.

ఇలాంటి వాటితో ప్ర‌భుత్వంపై నెగిటివ్ షేడ్స్ ప‌డే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించిన మోడీ అండ్ కో ఆ విధానానికి మంగ‌ళం పాడేశారు. పెంచిన ధ‌ర మీద ప్ర‌జ‌ల దృష్టి ఏమాత్రం ప‌డ‌కుండా కొత్త విధానాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. ఈ మ‌ధ్య‌న ప్ర‌తిరోజు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని మార్చేస్తామ‌ని.. దీంతో అంత‌ర్జాతీయంగా వ‌చ్చే లాభాల్ని వెనువెంట‌నే ప్ర‌జ‌ల‌కు బ‌దిలీ చేసే వీలుఉంటుంద‌ని చెప్పారు. ఇదంతా విన‌టానికి బాగానే ఉన్నా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఉన్న‌ట్లుగా చెప్పాలి.

రోజుకు పైసా..రెండు.. మూడు పైస‌లు చొప్పున పెంచేస్తూ జ‌నాల మీద బాదేస్తున్న వైనం జాగ్ర‌త్త‌గా చూస్తేనే క‌నిపించే ప‌రిస్థితి. పెట్రో ధ‌ర‌ల్ని రోజువారీగా మార్చేలా కొంత‌కాలం క్రితం నిర్ణ‌యం తీసుకున్నారు. తొలుత పావ‌లా.. అర్థ రూపాయి వ‌ర‌కూ త‌గ్గ‌టంతో కొత్త విధానంలో త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావించారు.

ఎప్పుడైతే పెట్రో ధ‌ర‌ల మీద జ‌నం ఫోక‌స్ త‌గ్గిందో అప్ప‌టి నుంచి బాదుడు షురూ అయిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌డిచిన న‌ల‌భై రోజుల పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్లో వ‌చ్చిన మార్పే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. రోజుకు.. పైసా.. రెండు.. మూడు పైస‌లు చొప్పున పెంచ‌ట‌మే కానీ త‌గ్గించ‌ని పెట్రో ధ‌ర‌ల పుణ్య‌మా అని ఇప్ప‌టివ‌ర‌కు రూ.4.36 మేర పెరిగాయి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇప్పుడు పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్న‌ట్లు? అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌ల్లో మార్పులు పెద్ద‌గా లేకున్నా.. ధ‌ర‌లు ఎందుకు పెరిగిన‌ట్లు? కేవ‌లం 40 రోజుల్లో ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా లీట‌రుకు రూ.5 ఎందుకు పెరిగిన‌ట్లు? అన్న‌వి ప్ర‌శ్న‌లు అయితే.. లీట‌రు మీద ఇంత భారీగా పెరిగినా ఎలాంటి నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు.. వ్య‌తిరేక‌త వెల్లువెత్త‌క‌పోవ‌టం చూసిన‌ప్పుడు మోడీ మాయాజాలం ఎలా ఉంటుందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇటీవ‌ల కాలంలో పెంచుకుంటూ పోతున్న ధ‌ర‌ల పోటుకు కార‌ణం.. డీల‌ర్ల మార్జిన్లు పెంచ‌టం కోస‌మేన‌ని చెబుతున్నారు. గ‌డిచిన కొద్దికాలంగా త‌మ మార్జిన్లు (లాభం) పెంచాలంటూ పెట్రోల్ బంకుల యజ‌మానులు డిమాండ్ చేస్తున్నారు. వారికి పెంచాల్సిన లాభాన్ని వినియోగ‌దారుడి జేబుల్లో నుంచి తీస్తున్న కేంద్రం తెలివితేట‌లు క‌నిపిస్తాయి. ఏ ఖ‌ర్చు కైనా జ‌నం జేబుల వైపే చూస్తూ.. నొప్పి తెలీకుండా లాగేస్తున్న వైనం మోడీ స‌ర్కారుకే చెల్లింద‌ని చెప్పాలి. ఇంత జ‌రిగినా ప్ర‌జ‌ల్లో ఇసుమంతైనా వ్య‌తిరేక‌త వ్య‌క్తం కాక‌పోవ‌టం మోడీకే సాధ్య‌మేమో? ఏపీలో జులై 1న ఏపీలో పెట్రోలు రూ.69.09 ఉంటే.. డీజిల్ రూ.60.32 ఉంది. బుధ‌వారం నాటికి ఉన్న ధ‌ర‌ల్ని ప‌రిశీలిస్తే పెట్రోల్ మీద రూ.5.61 పెరిగి రూ.74.70కు చేరుకుంటే డీజిల్ మీద లీట‌రుకు రూ.3.76 పెరిగి బుధ‌వారం నాటికి రూ.64.08 చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ధ‌ర‌ల్లో రూ.4 చొప్పున త‌క్కువ‌గా ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో లీట‌రు పెట్రోల్‌.. డీజిల్ మీద రూ.4 అద‌న‌పు ప‌న్ను ఉండ‌టం వ‌ల్ల అక్క‌డ ధ‌ర‌లు ఎక్కువ‌గా.. తెలంగాణ‌లో త‌క్కువ‌గా ఉన్నాయి. ఈ ఎక్కువ త‌క్కువ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. నొప్పి తెలీకుండా పెరిగే పోటు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌ల‌కు కామ‌నే సుమా.