Begin typing your search above and press return to search.

ఎర్ర‌కోట నుంచి మోడీ స్పీచ్ !

By:  Tupaki Desk   |   15 Aug 2018 3:59 AM GMT
ఎర్ర‌కోట నుంచి మోడీ స్పీచ్ !
X
దేశ ప్ర‌ధాని హోదాలో స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌రోసారి జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. త్రివిధ ద‌ళాల గౌర‌వ వంద‌నం స్వీక‌రించిన ఆయ‌న 72వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొని ప్ర‌సంగించారు. పంద్రాగ‌స్టు సంద‌ర్భంగా ఎర్ర‌కోట నుంచి తాను చేసే ప్ర‌సంగానికి సంబంధించి ప్ర‌స్తావించాల్సిన అంశాల‌కు సంబంధించి సూచ‌న‌లు చేయాల‌ని దేశ ప్ర‌జ‌ల్ని ప్ర‌ధాని కోరారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగం ఎలా ఉండ‌నుంద‌న్నాఆస‌క్తి వ్య‌క్త‌మైంది. జాతిని ఉద్దేశించి ఆయ‌న చేసిన ప్ర‌సంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

+ ఇవాళ దేశం ఒక ఆత్మవిశ్వసంతో ముందుకెళ్తోంది.

+ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం పరిశ్రమిస్తోంది.

+ నవ చైతన్యం - నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తోంది.

+ 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోంది.

+ ఏపీ - తెలంగాణ - మిజోరాం - ఉత్తరాఖండ్‌ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు.

+ ఎవరెస్టుపై మన బాలికలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆత్మవిశ్వాసాన్ని చాటారు.

+ పార్లమెంటు సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయి.

+ పేదలు - దళితులు - వెనుకబడిన వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగింది.

+ సామాజిక న్యాయం దిశగానూ సమావేశాలు ఫలప్రదమయ్యాయి.

+ దేశ రక్షణలో త్రవిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయి.

+ త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్నా’

+ దేశంలో ఓ పక్క వర్షాలు పడుతున్నాయన్న సంతోషం ఉన్నా.. మరోపక్క వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.

+ తమిళ కవి సుబ్రమణ్య భారతి స్వప్నించిన భారతాన్ని ఆవిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంది.

+ పేద - మధ్య తరగతి ప్రజలు ముందడుగు వేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నాం.

+ గిరిజనులు - దళితులు దేశ ప్రగతిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నాం.

+ 125 కోట్ల భారతీయులను ఒక్కటి చేసేందుకు కృషి చేస్తున్నాం.

+ టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నాం.

+ ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించాలన్న స్వప్నాన్ని సాకారం చేశాం.

+ ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్లు - ఆప్టికల్‌ ఫైబర్‌ లక్ష్యాలు నెరువేరుతున్నాయి.

+ పర్యావరణ పరిరక్షలో భారత్ ఆశా కిరణం.

+ ఇవాళ ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది.ఆర్థికవేత్తలు - సంస్థలు భారత్‌ లో అభివృద్ధిని పరిశీలిస్తున్నాయి.

+ గతంలో భారత్‌ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారు....కానీ ఇవాళ వాళ్లే భారత్‌ లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు.

+ లక్షల కోట్ల పెట్టుబడులకు భారత్‌ను అనుకూల ప్రాంతంగా మార్చాం.

+ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో ముందడుగు వేశాం.

+ ఈశాన్య రాష్ట్రాల్లోని చిట్టచివరి గ్రామాలు నేడు విద్యుత్‌ వెలుగులతో విరాజిల్లుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది.

+ 13 కోట్ల మంది ముద్రా రుణాలు తీసుకుంటే అందులో 4 కోట్ల మంది యువతే ఉన్నారు.

+ డిజిటల్‌ ఇండియాలో 3 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లు ప్రారంభించాం.

+ మంగళ్‌ యాన్‌ విజయంతో మన శాస్త్రవేత్తల కృషిని ప్రపంచానికి చాటాం.