కర్ణాటక ముఖ్యమంత్రికి మోడీ చాలెంజ్..

Wed Jun 13 2018 11:22:47 GMT+0530 (IST)

ఇటీవల కేంద్ర క్రీడల శాఖామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ లో భాగంగా వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే.. తాను చేయడమే కాకుండా ట్విట్టర్ లో పోస్టు చేసి విరాట్ కోహ్లీ హృతిక్ రోషన్ సైనా నెహ్వాల్ కు ట్యాగ్ చేశారు. అయితే కేంద్ర క్రీడల మంత్రి ట్వీట్ కు స్పందించిన విరాట్ తాను చేస్తున్న వ్యాయామాల వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అంతేకాకుండా తన భార్య అనుష్కశర్మ ప్రధాని నరేంద్రమోడీ మహేంద్రసింగ్ ధోనిలను ఈ చాలెంజ్ స్వీకరించాలంటూ ట్యాగ్ చేశారు.ఇటీవల కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ చాలెంజ్ ను స్వీకరించిన ప్రధాని మోడీ తాజాగా తన ఫిట్ నెస్ ప్రాక్టీస్ ను వీడియో తీసి పోస్టు చేశారు. ఈ ఉదయం వేశ ఎక్సర్ సైజ్ చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానని సోషల్ మీడియాలో మోడీ పోస్టు చేశారు.. ఇలా చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందని.. శ్వాసకు సంబంధించిన కసరత్తులు చేస్తానంటూ తన పోస్టులో పేర్కొన్నారు. మనం ఫిట్ గా ఉంటేనే దేశం ఫిట్ గా ఉంటుందంటూ తెలిపారు.

అనంతరం ప్రధాని మోడీ కూడా పలువురికి ఫిట్ నెస్ చాలెంట్ చేశాడు. కర్ణాటక ముఖ్యమంత్రి జేడీఎస్ నేత హెచ్.డీ కుమారస్వామికి ప్రధాని మోడీ ఫిట్ నెస్ చాలెంజ్ విసిరాడు.  2018 కామెన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన మానికా బాత్రా తోపాటు 40 ఏళ్లకు పైబడిన ఐపీఎస్ అధికారులకు చాలెంజ్ కు ఆహ్వానించారు. కర్ణాటకలో తన తెలివితేటలతో బీజేపీని చావుదెబ్బ తీసిన ప్రత్యర్థి కుమారస్వామికి మోడీ ఫిటెనెస్ చాలెంజ్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.