వారితో పవర్ కలిస్తే.. రెయిన్ బో అట

Mon Mar 20 2017 22:28:13 GMT+0530 (IST)

తెలుగు మీడియా రంగంలో మరో సంచలనం చోటు చేసుకోనుందా?అంటే.. అవునని చెబుతున్నారు కొందరు. ఒక విభిన్నమైన కాంబినేషన్ లో సరికొత్త తరహా ఛానల్ ఒకటి రానున్నట్లుగా చెబుతున్నారు. తెలుగు టీవీ రంగానికి సరికొత్తగా ప్రజంట్ చేసేలా మీడియా మొఘల్ రామోజీ రావు గ్రాండ్ లాంఛ్ చేసిన.. మారే కాలానికి తగినట్లుగా  మార్పులు చేసుకోకపోవటంతో.. నెంబర్  వన్ స్థానాన్ని టీవీ 9 తీసుకెళ్లిపోయింది. తెలుగు న్యూస్ ఛానళ్లలో  విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు టీవీ 9 రవిప్రకాశ్. తర్వాతి కాలంలో బరిలోకి దిగిన ఎన్ టీవీ చాలా తక్కువ కాలంలో బలమైన ఛానల్ పేరు సంపాదించింది.

ఈ రెండు ఛానళ్లకు కర్త.. కర్మ.. క్రియలుగా వ్యవహరించే రవి ప్రకాశ్.. నరేంద్ర చౌదరిల మధ్య ఇటీవల కాలంలో ఫ్రెండ్ షిప్ అంతకంతకూ పెరిగిందన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఒక కొత్త ఛానల్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం.. టైమ్ బౌండ్ తో కూడిన అగ్రిమెంట్ టీవీ9కి.. రవిప్రకాశ్ కు మధ్యన ఉందని..అతి తర్వలో ముగియనుందని చెబుతున్నారు.

నిర్మాత శరద్ మరార్.. పవన్.. టీవీ 9 రవిప్రకాశ్.. ఎన్టీవీ నరేంద్ర చౌదరిలు కలిసి ఒక ఎంటర్ టైన్ మెంట్  ఛానల్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారని.. దానికి రెయిన్ బో ఛానల్ అన్న పేరు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న ఎంటర్ టైన్మెంట్ ఛానళ్లకు ధీటుగా ఈ ఛానల్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలోఉన్నట్లు చెబుతున్నారు. మరి.. అదెంత వరకూ నిజమన్నది కాలమే చెప్పాల్సి ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/