లోకేష్...మళ్లీ కామెడీ పాలయ్యారు

Thu Apr 20 2017 22:40:02 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు యువ మంత్రి నారా లోకేష్ బ్యాడ్ టైం కొనసాగుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే పలు బహిరంగ సభల్లో సందర్భానికి విరుద్ధంగా మాట్లాడి నవ్వుల పాలయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో మరో కామెంట్ చేసి బుక్ అయిపోయారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మరోసారి నోరు జారిన లోకేష్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మొత్తం 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. దీంతో అవాక్కవడం కార్యకర్తల వంతు అయింది.ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాలు కేవలం 175 మాత్రమే కాబట్టి!

తెలుగుదేశం పార్టీ పరిపాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాల గురించి లోకేష్ వివరిస్తూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం టీడీపీ పాటుపడుతున్నదని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. మొత్తం రెండు వందల సీట్లలో టీడీపీ జెండా ఎగురవేయాలని అన్నారు. దీంతో అవాక్కవడం తమ్ముళ్ల వంతు అయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/