Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో భారీగా పెరిగిన బాబు ఆస్తుల విలువ!

By:  Tupaki Desk   |   22 March 2019 4:48 PM GMT
ఐదేళ్లలో భారీగా పెరిగిన బాబు ఆస్తుల విలువ!
X
గత ఎన్నికలప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ అఫడవిట్ లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా పేర్కొన్నారు. అలా గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఐదేళ్లు గడిచాయి. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికల నామినేషన్లో ఆస్తుల విలువను పేర్కొన్నారు.

ఇందులో భారీ హైక్ చోటు చేసుకోవడం విశేషం. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో పేర్కొన్న ఆస్తుల విలువకూ ప్రస్తుతం చెబుతున్న ఆస్తుల విలువకు పొంతనే లేదు. బాబు తన పేరిట - తన భార్య నారా భువనేశ్వరి పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువను ఏడు వందల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు!

నూటా డెబ్బై ఆరు కోట్ల రూపాయల నుంచి బాబు ఆస్తుల విలువ ఏడు వందల కోట్ల రూపాయలకు ఎకబాకడం విశేషం. ఐదేళ్లలో ఇంత గ్రోత్ అంటే మాటలు కాదు. ఈ ఆస్తుల్లో మెజారిటీ వాటా నారా భువనేశ్వరి మీదే ఉన్నట్టుగా బాబు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. నారా భువనేశ్వరి పేరిట తొంభై ఐదు కోట్ల రూపాయల స్థిరాలుస్తున్నాయట. ఇక 574 కోట్ల రూపాయల చరాస్తులు ఆమె పేరిట ఉన్నాయట. ఏడు వందల కోట్లలో నారా భువనేశ్వరి పేరిట ఆ ఆస్తులు ఉండగా, మిగతావి చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్నాయట.

ఇలా నూటా డెబ్బై ఆరు కోట్ల రూపాయల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల రేంజ్ కు వచ్చారు. ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు - నారా భువనేశ్వరి పేర్ల మీద ఉన్న ఆస్తులే. నారా లోకేష్ - బ్రహ్మణి - దేవాన్ష్ ల కథ వేరే. తమ పేరిట మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల ఆస్తులున్నట్టుగా లోకేష్ తన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

లోకేష్ పేరిట 253 కోట్ల 68 లక్షల రూపాయ చరాస్తులు - రూ.66 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయట. బ్రహ్మణి పేరిట నలభై కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు - దేవాన్ష్ పేరిట మరో ఇరవై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా లోకేష్ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో పేర్కొన్నారని సమాచారం.