బుడ్డోడ్ని బ్రాహ్మణి అంతలా తోమేస్తోందట

Mon Mar 20 2017 15:05:28 GMT+0530 (IST)

బుజ్జి దేవాన్ష్కు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్. ఒక ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన లోకేశ్.. కొడుకు గురించి ముచ్చట్లు చెప్పుకొచ్చారు. మనమడి గురించి తరచూ ప్రస్తావించే తాత చంద్రబాబును విడిగా కంటే.. పేపర్లలోనే ఎక్కువగా చూస్తుంటారని చెప్పారు. సీఎంగా తీరిక లేని షెడ్యూల్ తో బిజీబిజీగా ఉండే బాబు.. దేవాన్ష్ను కలవలేకపోవటం.. అమరావతిలో బాబు ఉంటే.. దేవాన్ష్ హైదరాబాద్ లో ఉండటంతో కుదరటం లేదన్నారు. దీంతో.. రోజు పేపర్లో తాత చంద్రబాబును.. మోడీ తాతను గుర్తిస్తూ ఉంటారన్నారు.ఇక.. దేవాన్ష్ ను వివిధ అంశాల్లో తర్ఫీదు ఇచ్చేందుకు బ్రాహ్మణి ఏమేం చేస్తుందో చెప్పుకొచ్చారు .  "బ్రాహ్మణి గురించి మీకు తెలుసుగా.. చిన్నప్పటినుంచే వాడ్ని తోమేస్తొంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నలభై ఐదు గంటల వరకూ జిమ్నాస్టిక్స్ అని.. 10.30 గంటలకు స్కూల్ అని.. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా బిజీబిజీగా ఉంటాడు.  వాడు నా కన్నా బిజీ అయిపోయాడు. నాకంటే వాడిది టైట్ షెడ్యూల్" అని లోకేశ్ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/