లోకేశ్ నోట జగన్ జపం

Mon Mar 20 2017 15:49:32 GMT+0530 (IST)

జగన్ అభిమానులు  - జగన్ ఫ్యామిలీ మెంబర్సు కూడా ప్రస్తావించనన్ని సార్లు టీడీపీ యువనేత లోకేశ్ జగన్ నామ జపం చేశారు. రీసెంటుగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన లోకేశ్ అందులో పదేపదే జగన్ ప్రస్తావన తెచ్చారు. ప్రశ్న ఏదైనా కానీ సమాధానంలో జగన్ పేరు చెబుతూ ఆయన గురించి మాట్లాడారు.  గంట పాటు సాగిన ఆ ఇంటర్వ్యూలో లోకేశ్ 20 నుంచి 25 సార్లు జగన్ పేరు పలికారు.
    
మీరు మంత్రి అయ్యాక పనితీరు విషయంలో కేటీఆర్ తో పోటీ ఉంటుంది కదా అని అడగ్గా లోకేష్ అటుతిప్పి ఇటు తిప్ప జగన్ పేరు ప్రస్తావించారు. కేటీఆర్ - జగన్ లు తనకు పోటీ కాదని అన్నారు. జగన్ గురించి అడగకపోయినా జగన్ తనకు పోటీ కాదని ఆయన చెప్పుకొచ్చారు. భూమా నాగిరెడ్డి మరణం గురించి అడిగితే జగన్ డెవలప్ మెంట్ కు అడ్డుపడుతున్నాడని లోకేష్ అన్నారు. పవన్ కల్యాణ్ గురించి అడిగినా కూడా ఆయన దానికీ జగన్ ప్రస్తావన తెచ్చారు.
    
టీడీపీ ప్రధాన కార్యదర్శిగా - రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మూడేళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది కదా.. అంటే దానిపై వివరణ ఇచ్చుకోవాల్సిన లోకేష్ బాబు - మళ్లీ జగన్ ప్రస్తావన తెచ్చాడు. తండ్రి అధికారంలో ఉండగా జగన్ దోచుకున్నాడని అన్నాడు.  ఇలా ప్రతి ప్రశ్నకు తానిచ్చిన సమాధానంలో జగన్ నామ స్మరణ చేశారు లోకేశ్. దీంతో లోకేశ్ మనసు నిండా జగన్ భయం ఉందని.. ఆయన నిత్యం జగన్ గురించే ఆలోచిస్తున్నారని.. మానసికంగా ఆయన జగన్ విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/