Begin typing your search above and press return to search.

లోకేష్ మెచ్చిన తెరాస మంత్రి

By:  Tupaki Desk   |   27 Aug 2015 11:56 AM GMT
లోకేష్ మెచ్చిన తెరాస మంత్రి
X
టీడీపీ యువ‌నేత నారా లోకేష్‌కు ఓ టీర్ ఎస్ మంత్రి ఆద‌ర్శ‌మ‌ట‌...అవును మీరు చూస్తున్న‌ది నిజ‌మే. టీడీపీకి రాజ‌కీయంగా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అయిన తెరాస పేరు చెపితేనే టీడీపీ నేత‌ల‌తో పాటు లోకేష్ కూడా అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతూ ఉంటారు. ఓటుకు నోటు కేసు త‌ర్వాత ఈ రెండు పార్టీల మ‌ధ్య నిప్పు రాజేస్తే అగ్గిమండిపోతుంద‌న్న స్థాయిలో వార్ జ‌రుగుతోంది. నిన్న‌టికి నిన్న ఎక్సైజ్ మంత్రి ప‌ద్మారావు లిక్క‌ర్ మార్కెట‌ర్ అని ట్వీట్ట‌ర్‌ లో ధ్వ‌జ‌మెత్తిన లోకేష్ తాజాగా తెరాస‌కే చెందిన మంత్రి హ‌రీష్‌ రావు అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని..ఆయ‌న నిజ‌మైన మాస్ లీడ‌ర్ అంటూ కితాబిస్తున్నారు. ఇటీవ‌ల లోకేష్ ఓ ఆంగ్ల‌దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో లోకేష్ పార్టీ కార్య‌క‌లాపాల్లో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నారు. కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి క‌న్వీన‌ర్‌ గా పార్టీ స‌భ్య‌త్వ న‌మోదులో రికార్డు సృష్టించిన లోకేష్ ఇప్పుడిప్పుడే మాస్ లీడ‌ర్‌ గా ఎదుగుతున్నారు. ఆయ‌న తాజా ఇంట‌ర్వ్యూ లో హ‌రీష్‌ రావు నుంచి తాను స్ఫూర్తి పొందుతాన‌ని..హ‌రీష్‌ రావు ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయే విధానం..ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌పై ఉన్న అభిమానం త‌న‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయంటూ మెచ్చుకున్నారు.

కేసీఆర్‌ తో పాటు ఆయ‌న టీంను త‌న‌దైన శైలిలో విమ‌ర్శించే లోకేష్ కేసీఆర్ మేన‌ల్లుడిని మాత్రం ఆకాశానికెత్తేయ‌డం విశేషం. లోకేష్ ప్ర‌శంస‌లు ఎలా ఉన్నా హ‌రీష్‌ రావుకు నిజంగానే ఆ స్థాయి ఇమేజ్ ఉంది. అందుకే సీఎం కేసీఆర్‌ తో స‌హా తెలంగాణ‌లో ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కు రాని విధంగా ప్ర‌తి సారి ఆయ‌న్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారు. హ‌రీష్‌ పై లోకేష్ కామెంట్లు తెరాస‌లో మిగిలిన మంత్రుల‌కు కాస్త కంట‌గింపుగానే ఉంటాయి. వీటికి వారు ఎలా రియాక్ట్ అవుతారో...లోకేష్‌ ను ఎలా టార్గెట్ చేస్తారో చూడాలి.