Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ జ్ఞాప‌కాలుంటే... అక్క‌డికి పంపండి!

By:  Tupaki Desk   |   21 Jan 2017 2:25 PM GMT
ఎన్టీఆర్ జ్ఞాప‌కాలుంటే... అక్క‌డికి పంపండి!
X
నంద‌మూరి తార‌క రామారావు... తెలుగు ద‌నానికి నిలువెత్తు రూపం. వెండితెర వేల్పుగా తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌గా ఆయ‌న స్థానం ఆంధ్రుల గుండెల్లో చిర‌స్థాయిగా ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్ స‌మ‌కాలీకులు చాలామంది ఉన్నారు. ఆయ‌న‌తో ఫొటోలు దిగిన‌వారు, ఆయ‌న రాసిన ఉత్త‌రాలు అందుకున్నవారు, ఆటోగ్రాఫ్ లు తీసుకున్న‌వారు, ఆయ‌న‌తో వివిధ సంద‌ర్భాల్లో క‌లిసి పోరాటాలు చేసిన చేసివారు... ఇలా చాలామంది ఇప్ప‌టికీ ఉన్నారు. వారిని క‌దిలిస్తే ఎన్నో జ్ఞాప‌కాలు. ఎన్టీఆర్‌ కు సంబంధించిన ఎంతో తీపి గుర్తులు. అయితే, అలాంటివ‌న్నీ ముందు త‌రాల‌కు అందించే ఓ అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌.

ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోలుగానీ, ఆయ‌న రాసిన ఉత్త‌రాలుగానీ, లేదా ఆయ‌న ద్వారా అందుకున్న బ‌హుమానాలుగానీ... ఇలాంటి ఏవి ఉన్నా స‌రే ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌కు పంపించొచ్చు. వాటిని ఎన్టీఆర్ మ్యూజియంలో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్ది ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం పెడ‌తామ‌నీ, పంపిన‌వారి పేర్ల‌ను కూడా ప్ర‌ముఖంగా క‌నిపించేలా డిస్ ప్లే చేస్తామ‌ని చెప్పారు నారా బ్రాహ్మ‌ణి. భ‌ర్త నారా లోకేష్, త‌న‌యుడు దేవాన్ష్ తో క‌లిసి విజ‌య‌వాడ సిద్ధార్థ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియంను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల‌తో బ్రాహ్మ‌ణి మాట్లాడారు.

తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో ఎన్టీఆర్ చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అన్నారు. ఆయ‌న జీవితానికి సంబంధించిన విశేషాల‌తో ఈ మ్యూజియాన్ని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దుతామ‌నీ, ఎన్టీఆర్ గురించి ఎన్నో పాజిటిల్ అంశాలు ప్ర‌జ‌ల‌కు చేరాల‌న్న సత్సంక‌ల్పంతో ఉన్నామ‌ని ఆమె చెప్పారు. న‌యా రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మించ‌త‌ల‌పెట్టిన ఎన్టీఆర్ మ్యూజియంను ఫైన్ ఆర్ట్స్ కు ఒక వేదిక‌గా ఉండేలా తీర్చిదిద్దాల‌నుకుంటున్న‌ట్టు చెప్పారు. వ‌చ్చే ఏడాదికి మ్యూజియంను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా త‌యారు చేయాల‌నీ, దీనికోసం ఎన్టీఆర్ కు సంబంధించిన వ‌స్తువుల్ని ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ట్ర‌స్ట్ కు పంపించాల‌ని ఆమె కోరారు. సో... తార‌క రాముడి జ్ఞాప‌కాలు ఏవైనా ఉంటే ముందు త‌రాల‌కు అందించే అవ‌కాశం ఇది.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/