Begin typing your search above and press return to search.

మామ‌కు ధీమానిస్తూ అల్లుడు మాట‌లు విన్నారా?

By:  Tupaki Desk   |   14 Oct 2018 6:02 AM GMT
మామ‌కు ధీమానిస్తూ అల్లుడు మాట‌లు విన్నారా?
X
ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య న‌డుస్తున్న హాట్ హాట్ వ్యాఖ్య‌ల వేళ‌.. అందుకు భిన్నంగా మాట్లాడిన తాజా మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడైన నేత‌గా నాయిని అభివ‌ర్ణిస్తుంటారు. అలాంటి ఆయ‌న‌.. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని.. దొర‌క‌టం లేద‌న్నారు.

ఉన్న‌ది ఉన్న‌ట్లుగా కుల్లాగా మాట్లాడే అల‌వాటున్న నాయిని.. ఈ మ‌ధ్య‌న త‌న అడ్డా అయిన ముషీరాబాద్ లోని స్థానిక మీడియాలో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను కేసీఆర్ 2014లో పోటీ చేయొద్ద‌న్నార‌ని చెప్ప‌టమే కాదు.. ముషీరాబాద్ కాకుండా మ‌రో స్థానం నుంచి బ‌రిలోకి దిగితే రూ.10కోట్లు ఇస్తామ‌ని చెప్పినా తాను నో చెప్పాన‌ని చెప్పారు. అయితే.. తాను చెప్పిన రూ.10కోట్ల మాట‌తో కొత్త తిప్ప‌లు తెర మీద‌కువ‌స్తాయ‌న్న మాట బ‌లంగా వినిపించింది.

దీనికి త‌గ్గ‌ట్లే నాయిని తాజాగా మాట్లాడుతూ.. తాను రూ.10 ల‌క్ష‌లు అన‌బోయి రూ.10 కోట్లు అన్న‌ట్లుగా నాయిని చెప్పారు. త‌న మాట‌ల్ని ప‌ట్టుకొని లొల్లి చేస్తున్నారంటూ రేవంత్ పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే.. నాయిని కోరుకున్న‌ట్లుగా ముషీరాబాద్ సీటును కేసీఆర్ ఇస్తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా నాయిని అల్లుడు క‌మ్ కార్పొరేట‌ర్ శ్రీ‌నివాస‌రెడ్డి నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు ఇప్పుడు కొంత ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ముషీరాబాద్ టికెట్ ను త‌న‌కు ఇస్తార‌ని.. ఒక‌వేళ కాదంటే త‌న మామ‌కు ఇస్తార‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. ఏడాదికాలంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ ను తిరుగులేని శ‌క్తిగా మార్చిన‌ట్లు చెప్పారు. త‌న‌కు పోటీ చేసే అవ‌కాశాన్ని కేసీఆర్ ఇస్తే.. భారీ మెజార్టీతో గెలిచి.. ఆ విజ‌యాన్ని కేసీఆర్ కు అంకితం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.

ఒక‌వైపు నాయిని.. మ‌రోవైపు ఆయ‌న అల్లుడు ఇద్ద‌రూ అన్నేసి ఆశ‌లు పెట్టుకున్న సీటును వారు కోరుకున్న‌ట్లుగా కేసీఆర్ కేటాయిస్తారా? లేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. త‌న కాబినెట్ లో హోంమంత్రిగా ప‌ని చేసిన నాయినికి అపాయింట్ మెంట్ కోసం అదే ప‌నిగా తిప్పిస్తున్న కేసీఆర్‌.. నాయినికో.. ఆయ‌న అల్లుడికో పార్టీ టికెట్ ఇస్తారా? ఇచ్చే సినిమానే ఉంటే.. అన్నిసార్లు తిప్పించుకోవ‌టం కేసీఆర్ అల‌వాటు కాదే..?