Begin typing your search above and press return to search.

మోడీ యాప్ ఎంత డేంజ‌రో చెప్పేశాడు

By:  Tupaki Desk   |   25 March 2018 5:05 AM GMT
మోడీ యాప్ ఎంత డేంజ‌రో చెప్పేశాడు
X
సోష‌ల్ మీడియాలో కింగ్ లాంటి ఫేస్ బుక్ కు సంబంధించి డేటా చౌర్యం మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇలాంటి వేళ‌.. భార‌తీయులు ఒక్క‌సారి ఉలిక్కిప‌డే మాటను చెప్పారు ఫ్రాన్స్ చెందిన సైబ‌ర్ సెక్యూరిటీ పరిశోధ‌కుడు ఇలియ‌ట్ ఏల్డ‌ర్స‌న్.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేరిట దేశంలో ప్రాచుర్యం పొందిన న‌మో యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నంత‌నే వ్య‌క్తిగ‌త డేటా మొత్తం క్లెవ‌ర్ ట్యాప్ అనే అమెరికా కంపెనీకి వెళ‌తాయ‌ని ఆయ‌న చెబుతున్నారు. యూజ‌ర్ల స‌మ్మ‌తితో సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా క్లెవ‌ర్ ట్యాప్ కు చెందిన డొమైన్ అయిన ఇన్ డాట్ డ‌బ్ల్యూజెడ్ ఆర్ కేటీ డాట్ కామ్‌కు వెళుతుంద‌ని ఆయ‌న చెప్పారు. న‌మో యాప్ చాలా డేంజ‌ర్ అని ఆయ‌న చెబుతున్నారు.

ఆయ‌న చెబుతున్న మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వెంట‌నే స‌ద‌రు వ్య‌క్తి పేరు.. అత‌డు పురుషుడా? స్త్రీనా? ఫోటోలు.. ఈమొయిల్.. ప‌ర్స‌న‌ల్ నెంబ‌ర్లు ఇలా అని వెళ్లిపోతాయ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇవే కాదు.. ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌.. నెట్ వ‌ర్క్ లాంటి డివైజ్ కు సంబంధించిన వివ‌రాలు వెళ‌తాయ‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే జీ డేటా అనే సంస్థ అయితే మ‌రో అడుగు ముందుకేసి.. ఈ డొమైన్ ఓ పెద్ద ఫ్రాడ్ లింక్ గా అభివ‌ర్ణించింది. వ్య‌క్తిగ‌త వివ‌రాలు.. పాస్ వ‌ర్డ్‌లు.. క్రెడిట్ కార్డుల నంబ‌ర్ల తో పాటు దొంగ ప‌ద్ద‌తుల్లో మోస‌పూరిత ఈమొయిల్స్ పంపుతుంటుంద‌ని చెప్పింది. ఇలా వ్య‌క్తిగ‌త వివ‌రాలన్ని సేక‌రిస్తున్నారన్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మ‌ని.. ఆందోళ‌క‌ర‌మ‌ని చెబుతున్నారు.