Begin typing your search above and press return to search.

ఎన్టీవీ చౌదరి కొత్త కారు రేటెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:25 AM GMT
ఎన్టీవీ చౌదరి కొత్త కారు రేటెంతో తెలుసా?
X
చాలామందికి కార్లన్నా - బైక్స్ అన్నా మహా మోజు. అవసరం ఉన్నా లేకునా స్థాయిని బట్టో - వాటిపై ఉన్న ఆసక్తిని బట్టో మార్కెట్లోకి వచ్చే రకరకాల కార్లను కొనడం కొంతమంది డబ్బునవారికి ఆసక్తి. ఈ విషయంలో చాలామంది అత్యంత విలాసవంతమైన - ఖరీదైన కార్లపై మోజు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇండియాలో దొరక్కపోతే.. విదేశాలనుంచి సైతం ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని మరీ దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ఇలాంటి ఒక విలాసవంతమైన - ఖరీదైన కారును తెలుగు రాష్ట్రాల్లోని ఒక మీడియా సంస్థ యజమాని దక్కించుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన కార్లు అనగానే - బెంట్లీ - ఫెరారి - ల్యాంబోర్గిని - పోర్షే వంటి సంస్థలకు చెందిన కార్లు గుర్తొస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైనవిగా బెంట్లీ కంపెనీ కార్లను చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఈ కంపెనీ అందించిన ఎస్‌యువి అత్యంత ఖరీదైన కారుగా తనకంటూ ఒక రికార్డుని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈస్థాయి లగ్జరీ కార్లను అందించే బెంట్లీకి కి సంబందించిన బెంట్యాగా వాహనాన్ని ఎన్టీవీ గ్రూపు చైర్మన్ నరేంద్ర చౌదరి సొంతం చేసుకున్నారు.

అత్యంత విలాసవంతమైన - వేగవంతమైన ఎస్యూవీ లేబుల్ - బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ నుండి విడుదలయిన బెంట్యాగా కారును రూ.5.2 కోట్లు ఖర్చుచేసి నరేంద్ర చౌదరి కొనుగోలుచేశారు! బెంట్లీ ఇప్పటివరకూ భారతదేశంలో విడుదల చేసిన నాలుగు కార్లలో ఇది ఒకటి. దీంతో ఈ కారుని సొంతం చేసుకున్న మొట్టమొదటి తెలుగు రాష్ట్రాల వ్యక్తిగా నరేంద్ర చౌదరి నిలిచారు.