Begin typing your search above and press return to search.

విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం..ఎన్ ఐఏ దాడి.

By:  Tupaki Desk   |   19 Sep 2019 7:42 AM GMT
విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం..ఎన్ ఐఏ దాడి.
X
హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అయితే లోకల్ పోలీసులు ఎప్పుడో ఒకప్పుడు సమాచారం మేరకు పట్టుకుంటున్నా ఈ దందా ఆగడం లేదు. తాజాగా ఈ వ్యభిచార ముఠాలు విదేశాల నుంచి యువతులను తీసుకొచ్చి మరీ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) పసిగట్టింది. ఉగ్రవాదులు - తీవ్రవాదం - నక్సలిజం లాంటి భారీ కేసుల్లో ఇన్ వాల్వ్ అయ్యే ఎన్ ఐఏ తాజాగా విదేశీ యువతులతో హైదరాబాద్ లో సాగిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని గుట్టు రట్టు చేయడం సంచలనంగా మారింది..

కేంద్రంలో బీజేపీ వచ్చాక హైదరాబాద్ పై నజర్ పెరిగింది. ఇటీవల చాలాసార్లు ఎన్ ఐఏ అధికారులు ఐసిస్ ఉగ్రసంస్థకు ప్రభావితం అవుతున్న హైదరాబాద్ యువకులపై నిఘా వేసి పట్టుకుంటున్నారు. అయితే తాజాగా బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొచ్చి హైదరాబాద్ లో వ్యభిచారం చేయిస్తున్న ఎన్ఐఏ ముఠాను చాకచక్యంగా పట్టుకోవడం సంచలనంగా మారింది..

హైదరాబాద్ లోని పాతబస్తీ అంటేనే అదో సామ్రాజ్యంగా పేరుపొందింది.. అక్కడ విషయాలు పెద్దగా బయటకు పొక్కవు. దాంతో పాతబస్తీకి చెందిన యూసుఫ్ ఖాన్, బేగం దంపతులు బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ సెక్స్ రాకెట్ పై ఏకంగా ఎన్ ఐఏకు సమాచారం అందడంతో వారు స్థానిక చత్రినాక పోలీసుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఐదుగురు బంగ్లాదేశ్ యువతులను పట్టుకొని స్వదేశానికి పంపారు. యూసుఫ్-బేగం దంపతులపై కేసులు పెట్టి రిమాండ్ కు తరలించారు.

హైదరాబాద్ పై ఎన్ ఐఏ తీవ్ర నజర్ పెట్టిందనడానికి ఈ బంగ్లాదేశ్ యువతుల వ్యభిచారం గుట్టురట్టే నిదర్శనమంటున్నారు. హైదరాబాద్ వ్యభిచారానికి అడ్డాగా మారిందన్న విమర్శలున్నాయి. మొన్ననే పంజాగుట్ట పోలో లాడ్జిలో విదేశీయులైన ఉబ్జెకిస్తాన్ యువతులతో చేయిస్తున్న వ్యభిచారం రట్టు అయ్యింది. వరుసగా హోటల్స్ - స్పాలు - ఫాం హౌస్ లలో ఈ వ్యభిచార దందా హైదరాబాద్ లో యథేచ్ఛగా సాగుతోందంటున్నారు. హైదరాబాద్ పోలీసులు పట్టించుకోపోవడంతోనే కేంద్రం దర్యాప్తు సంస్థ ఏకంగా రంగంలోకి దిగి దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.