Begin typing your search above and press return to search.

రాజ‌కీయ స‌న్యాసం ప్ర‌క‌టించిన మైసూరా

By:  Tupaki Desk   |   27 April 2016 10:40 AM GMT
రాజ‌కీయ స‌న్యాసం ప్ర‌క‌టించిన మైసూరా
X
సీనియర్ పొలిటీషియన్ - ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. గతంలో కాంగ్రెస్ - ఆ తర్వాత టీడీపీలో కొనసాగిన మైసూరారెడ్డి గడచిన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీలోనూ కొంతకాలం పాటు క్రియాశీలంగా ఉన్న మైసూరా ఆ తర్వాత తెర వెనుకకు వెళ్లారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్బంగా పార్టీతో పాటు పార్టీ అధినేత వైఖరిని తూర్పారబట్టిన మైసూరా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న ద‌గ్గ‌ర డ‌బ్బుకు త‌ప్ప వ్య‌క్తుల‌కు విలువ ఉండ‌ద‌ని తేల్చేశారు. టీ తాగ‌డానికి అంటూ ఇంట్లోకి పిలిచి హ‌ఠాత్తుగా కండువా క‌ప్పార‌ని కూడా మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ గురించి ప్ర‌స్తావించిన మైసూరా రెడ్డి ఇకపై రాజకీయాల్లో ఉండనని తేల్చిచెప్పేశారు. ‘‘ఏ పార్టీలో చేరను. ఇంట్లో కుర్చుని పుస్తకాలు రాసుకుంటా’’ అని మైసూరా రెడ్డి అన్నారు.

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌నిచేసి మైసూరారెడ్డికి రాజ్యాంగ‌ప‌ర‌మైన అంశాల్లో మంచి ప‌ట్టుంద‌ని పేరు. గ‌తంలో కాంగ్రెస్‌ లో ఉన్న‌పుడు తెలుగుదేశంపై నిశిత‌మైన ఆరోప‌ణ‌లు చేసే క్ర‌మంలో మైసూరా పెద్ద ఎత్తున శ్ర‌మించారు. తెలుగుదేశంలో చేరిన త‌ర్వాత పార్టీకి విలువైన సూచ‌న‌లు చేసిన నాయ‌కుడిగా పేరుంది. విప‌రీత‌మైన చ‌దువ‌రిగా మైసూరా రెడ్డికి పేరుంది.