అమెరికాలో భారతీయుడి అనుమానాస్పద మృతి

Wed Jun 13 2018 12:14:25 GMT+0530 (IST)

 జాబ్ చేయడం కోసం అమెరికాకు ఆశగా వెళ్లిన దీపక్ ఆశలు అడియాసలయ్యాయి.  అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బీమౌంట్ ప్రాంతంలో భారతీయ యువకుడు దీపక్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.  దీపక్ ది ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పామూరు గ్రామం.దీపక్ 2015లో జరిగిన యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు.  ఈ ప్రమాదంలో దీపక్ ఫ్రెండ్ శైలేంద్ర హర్ష చనిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు దీపక్ అంతుచిక్కని విధంగా చనిపోవడం అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఉంటున్న దీపక్ తల్లిదండ్రులకు కొడుకు చనిపోయాడని వార్త తాజాగా రావడంతో వారు భోరుమంటున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

అమెరికా ప్రభుత్వంతో  కేంద్ర ప్రభుత్వం  మాట్లాడి దీపక్  మృతదేహాన్ని  వెంటనే భారత్ కు తీసుకురావాలని  కుటుంబ సభ్యులు స్నేహితులు  కోరుతున్నారు. అయితే దీపక్ మృతికి అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.