Begin typing your search above and press return to search.

ఓవైసీ పిలుపు..ముస్లింల‌కే ఓటేయండి

By:  Tupaki Desk   |   25 Jun 2018 9:51 AM GMT
ఓవైసీ పిలుపు..ముస్లింల‌కే ఓటేయండి
X
ఏఐఎంఐఎం చీఫ్ - హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ‌హారాష్ట్ర వేదిక‌గా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మహారాష్ట్రలోని బీడ్‌ లో జరిగిన ఓ సభలో అసద్ క‌ల‌కలం రేపే కామెంట్లు చేశారు. దేశంలో లౌకికవాదం కొనసాగాలంటే.. ముస్లింలంతా ఏకమవ్వాలని - వాళ్లంతా ముస్లింలకే ఓటేయాలని అన్నారు. ఈ సంద‌ర్భంగా అస‌ద్ ప‌లు రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో జ‌రిగిన అన్యాయాన్నిస‌రిదిద్దేందుకు, భ‌విష్య‌త్‌ లో అన్యాయం జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఇదే మార్గ‌మన్నారు.

యూపీలోని హపూర్ జిల్లాలో ఆవుల స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ ఖాసిమ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అసద్ ప్రస్తావించారు. ఖాసిమ్ హత్య మనందరినీ మరోసారి ఆలోచించేలా చేస్తున్నది. అతని కోసం కన్నీళ్లు పెట్టకండి. కానీ సంఘటితమవ్వండి. లౌకికవాదం గురించి మాట్లాడేవాళ్లు అతిపెద్ద దోపిడీదారులు. అవకాశవాదులు. వాళ్లు 70 ఏళ్లుగా ముస్లింలను వాడుకున్నారు. మనల్ని భయపెట్టారు - తొక్కేశారు అంటూ అసద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకే ఓ రాజకీయ శక్తిగా ముస్లింలు ఎదగాలని - ముస్లిం అభ్యర్థులే గెలిచేలా ఓట్లేయాలని అసద్ పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇదేనా మీ సబ్‌కా సాథ్ - సబ్ కా వికాస్ నినాదానికి అర్థం అంటూ నిలదీశారు.

కొద్దికాలం క్రితం త్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ముంబైలోని నాగ్‌ పడా ప్రాంతంలో ప్రచారం చేస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైన సంగ‌తి తెలిసిందే .ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరాడు. షరియత్ చట్టం పరిరక్షణ అంటూ దేశవ్యాప్తంగా అసద్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముంబైలో ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. అయితే షూ విసిరినా కూడా అసద్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇలాంటి పనులతో తన గొంతు నొక్కలేరని అసద్ అన్నారు.