Begin typing your search above and press return to search.

భారత్ లో ముస్లింలపై వేధింపులట..పాక్ కు వెళ్లనందుకేనట!

By:  Tupaki Desk   |   20 July 2019 4:35 PM GMT
భారత్ లో ముస్లింలపై వేధింపులట..పాక్ కు వెళ్లనందుకేనట!
X
ఆజం ఖాన్... వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గానే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీలో కీలక నేతగానే కాకుండా ఆ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికైన ఈ మైనారిటీ నేత... ఎప్పుడు నోరు తెరిచినా వివాదాస్పద వ్యాఖ్యలే వస్తాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారానే ఆజం ఖాన్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నిత్యం వివాదాల్లోనే ఉండే ఆజం... ఇప్పుడు కూడా తనదైన శైలి వివాదాస్పద వ్యాఖ్య చేసి కాక రేపారు. భారత దేశంలో ముస్లింలు అనేక వేధింపులకు గురవుతున్నారని ఓ సర్టిఫికెట్ ఇచ్చేసిన ఆజం ఖాన్... అందుకు గల కారణాన్ని కూడా వివరించే యత్నం చేశారు. దేశ విభజన సమయంలో ముస్లింలు పాకిస్థాన్ కు వెళ్లని కారణంగానే ముస్లింలపై భారత్ లో వేధింపులు కొనసాగుతున్నాయని ఆయన తనదైన జడ్జిమెంట్ ఇచ్చారు.

ఆజం ఖాన్ నోట నుంచి వచ్చిన ఈ కామెంట్ పై ఇప్పుడు నిజంగానే పెద్ద రచ్చే జరిగే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని తన సొంత నియోజకవర్గం రాంపూర్ నుంచి ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆజం... సినీ నటి - మాజీ ఎంపీ జయప్రదపై తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా నేత అన్న భావన కూడా లేకుండా ఆయన నోట నుంచి వచ్చిన అసభ్యకర కామెంట్లకు జయప్రద ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే కదా.సరే... ఎన్నికల్లో ఎలాగోలా... ఇలా సంచలన వ్యాఖ్యలు చేసే గెలిచిన ఆజం ఆ తర్వాత కూడా ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. తాజాగా దేశంలో ముస్లింలపై వేధింపులు కొనసాగుతున్నాయని చెప్పిన ఆయన... పాక్ కు వెళ్లనందుకే ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని ఆజం ఖాన్... ముస్లిం లంతా పాక్ కు వెళ్లేందుకే మొగ్గు చూపారని, అయితే నాటి పెద్దలు మహాత్మా గాంధీ - పండిట్ జవహర్ లాల్ నెహ్రూ - వల్లభాయ్ పటేల్ - మౌలాపా అబుల్ కలామ్ ఆజాద్ లు వద్దని వారించారని - వారి మాటకు విలువ ఇచ్చిన కారణంగానే ముస్లింలు పాక్ కు వెళ్లకుండా భారత్ లోనే ఉండిపోయారని చెప్పారు. అంతేకాకుండా భారత్ ను ముస్లింలు తమ దేశంగా భావించారని కూడా ఆజం తనదైన శైలి కామెంట్ చేశారు. మొత్తంగా దేశంలో ముస్లింలపై వేధింపులు కొనసాగుతున్నాయని, ఓ ఎంపీగా ఉన్న ఆజం ఖాన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగానే మారిపోయిందని చెప్పాలి.