బాలాజీని కూడా కమ్మకులంలో కలిపేసుకున్నారు

Thu May 24 2018 21:57:26 GMT+0530 (IST)

మీది ఒక కుల పార్టీ అంటే వాళ్లు కాదంటారు. కానీ వారు తలపులనిండా అవే. నోరు తెస్తే కులపిలుపులే. చేయికలిపితే కులమే ప్రామాణికం. ఒక టీడీపీ నేత కంపెనీలో అయితే ఆ కులం వాళ్లకు తప్ప వేరే వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇవ్వరు. అలాంటి నేతలతో అలరారే తెలుగు దేశం పార్టీలో కులకలానికి ట్రెండ్ సెట్టర్‌గా మారారు ఎంపీ మురళీమోహన్. కులం పిచ్చికి ఇంతకు వరకు ఎన్ని ఉదాహరణలున్నా మురళీ మోహన్ ఎగ్జాంపుల్ ముందు దిగదుడుపే. ఏకంగా ఆయన ఆ ఏడుకొండల వాడికే కుల నామకరణం చేశారు.ఇంతకీ ఏం జరిగిందంటే... ఒక పార్టీ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ మురళీ మోహన్ మోడీ-బీజేపీ వెంకటేశ్వరుని సన్నిధిలో మోసం చేశారంటూ అందుకే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ వేంకటేశ్వరస్వామిని *వెంకన్న చౌదరి* అనేశారు. ఒకట్రెండు సార్లు మరీ అన్యాయంగా మన వెంకన్న మన వెంకన్న అంటూ ఏదో పార్టీ కార్యకర్తను ప్రస్తావించినట్లు మాట్లాడిన మురళీ మోహన్ స్వామిని ఏకంగా పేరు మార్చి తమ కులం తోక తగిలించి వెంకన్న చౌదరి అని పిలిచారు. దీంతో అక్కడున్న టీడీపీ నేతలు బిక్క చచ్చిపోయారు. దాన్ని కవర్ చేసుకోవడానికి టీడీపీ నేతలు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.

అసలే ఇది సోషల్ మీడియా కాలం. వేగంగా ఆయన కులపిచ్చి మీడియాకెక్కేసింది. ఎక్కడ చూసినా ఇంటర్నెట్‌లో ఇదే సంచలనం ఈరోజు. నిరంతరం ఆ కులపిచ్చిన వదిలించుకోకపోతే వారికి ఏం నష్టమో తెలియదు గాని భిన్న వర్గాలు కులాలున్న ఏపీకి మాత్రం చెప్పలేనంత నష్టం. ఈ విషయం వారి అధినాయకుడు గ్రహించాలి.

ఇప్పటికే టీటీడీ నగల మాయం విషయంలో అనేక ఆరోపణలు రావడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న ఆ నేతలు తాజాగా వారు తిరుమలకు ఇచ్చే గౌరవం ఏంటో నిరూపించారు.


వీడియో కోసం క్లిక్ చేయండి