Begin typing your search above and press return to search.

ముర‌ళీమోహ‌న్ కోడ‌లికి రోడ్డు ప్ర‌మాదం..

By:  Tupaki Desk   |   19 April 2019 7:52 AM GMT
ముర‌ళీమోహ‌న్ కోడ‌లికి రోడ్డు ప్ర‌మాదం..
X
రాజ‌మండ్రి టీడీపీ ఎంపీ అభ్య‌ర్థి క‌మ్ ప్ర‌ముఖ సీనియ‌ర్ సినీ న‌టుడు ముర‌ళీమోహ‌న్ కోడ‌లుగా సుప‌రిచితులైన మాగంటి రూప రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ప్ర‌యాణిస్తున్న‌కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఆమెకు గాయాల‌య్యాయి.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే.. గాయాలైన ఆమెను హుటాహుటిన అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ద‌గ్గ‌ర్లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ప్ర‌మాదం ఎందుకు జ‌రిగింది? కార‌ణాలు ఏమిటి? అన్న పూర్తి వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఆమెకు ప్ర‌మాదం లేద‌ని.. ప‌రీక్ష‌లు మొత్తం పూర్తి అయ్యాక ఆమెను డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉందంటున్నారు.