పాడు సైగలు చేసినోడికి కోర్టు అనూహ్య శిక్ష!

Thu Jan 24 2019 14:00:23 GMT+0530 (IST)

పాడు పని చేసినోడికి కోర్టు విధించిన శిక్ష షాకింగ్ గా మారింది. ముంబయి క్రిమినల్ కోర్టు అనూహ్యంగా వ్యవహరించిన వేసిన శిక్ష.. ఫోక్సో కేసులో వేసిన అతి తక్కువ శిక్ష కావటం గమనార్హం. 2015లో తన ఎదురింట్లో ఉన్న 12 ఏళ్ల బాలికకు 29ఏళ్ల అరవింద్ కబ్ దేవ్ కామన్ అనే దరిద్రుడు అశ్లీలంగా వ్యవహరించాడు.తనింట్లో నగ్నంగా ఉండి.. ఆ బాలికకు పాడు సైగలు చేశారు. అశ్లీలంగా ప్రవర్తించాడు. దీనిపై ఫిర్యాదు గోవాదేవి పోలీస్ స్టేషన్లో నమోదైనంది. ఈ కేసును విచారించిన ముంబయి క్రిమినల్ కోర్టు నిందితుడు తప్పు చేసినట్లు నిర్దారించారు. చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై నమోదు చేసే ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు.

కోర్టు విచారణలో నిందితుడి దోషిగా గుర్తించారు. అయితే.. అతడికి రూ.30వేల జరిమానాను విధించటమే కాదు. కోర్టు హాలులో ఒక రోజంతా కూర్చోవాలంటూ న్యాయమూర్తి షాకింగ్ తీర్పు ఇచ్చారు. ఒకవేళ.. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలలు జైలుశిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పాడు పని చేసినోడికి మరింత కఠినమైన శిక్షను వేస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.