Begin typing your search above and press return to search.

మా ద‌గ్గ‌ర నుంచి తీసుకెళ్లి చంపేశారే!

By:  Tupaki Desk   |   26 Sep 2017 12:03 PM GMT
మా ద‌గ్గ‌ర నుంచి తీసుకెళ్లి చంపేశారే!
X
ప్ర‌పంచంలో అత్యంత బ‌రువైన మ‌హిళ‌గా గుర్తింపు పొందిన ఎమాన్ అహ్మాద్ మ‌ర‌ణం ముంబ‌యి వైద్యుల‌కు షాకింగ్ గా మారింది. భారీ బ‌రువుతో ఉన్న ఆమె శ్వాస తీసుకోవ‌టం కూడా క‌ష్టంగా మారిన వేళ‌.. ఈజిప్ట్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ముంబ‌యికి తీసుకురావ‌టం తెలిసిందే.

భారీ బ‌రువుతో త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చికిత్స పొందిన ఎమాన్‌.. మ‌ర‌ణించింద‌న్న వార్త‌ను ముంబ‌యిలోని సైఫీ ఆసుప‌త్రి వైద్యులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. భారీ బ‌రువుతో త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఎమాన్‌ను 20 డాక్ట‌ర్ల బృందం చికిత్స చేసింది.

400 కేజీల‌కు పైనే ఉన్న ఆమెకు బేరియాట్రిక్ స‌ర్జ‌రీతో దాదాపు 330 కిలోల బ‌రువు త‌గ్గారు. అయితే.. ఆమెకు చికిత్స చేస్తున్న స‌మ‌యంలో వైద్యుల తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఎమాన్ సోద‌రి ముంబ‌యి నుంచి అబుదాబికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఎమాన్ ను మ‌రెక్క‌డికీ తీసుకెళ్ల‌వ‌ద్ద‌ని తాము మెరుగైన చికిత్స ఇస్తామ‌ని చెప్పినా ఎమాన్ కుటుంబ స‌భ్యులు ఒప్పుకోలేద‌న్నారు. అధిక బ‌రువుతో ఉన్న 36 ఏళ్ల ఎమాన్ గుండె సంబంధిత వ్యాధుల‌తో పాటు కిడ్నీలు ప‌నిచేయ‌క‌పోవ‌టం కార‌ణంగా సోమ‌వారం ఆమె మ‌ర‌ణించారు.

అయితే.. ఆమె మ‌ర‌ణంపై సైఫీ వైద్యులు స్పందించారు. ఎమాన్ మ‌ర‌ణాన్ని తాము జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని.. ఆమెను కానీ ముంబ‌యిలోనే ఉంచి ఉంటే త‌ప్ప‌నిస‌రిగా బ‌తికి ఉండేద‌ని.. అబుదాబికి త‌ర‌లించి త‌ప్పు చేశార‌ని వాపోయారు. త‌మ వ‌ద్ద నుంచి ఎమాన్ ను మ‌రెక్క‌డికి తీసుకెళ్లొద్ద‌ని చెప్పినా ఆమె కుటుంబ స‌భ్యులు ఒప్పుకోలేద‌న్న ఆవేద‌న‌ను ముంబ‌యి వైద్యుల బృందం ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆసుప‌త్రిలో మ‌ర‌ణించిన ఎమాన్ అంత్య క్రియ‌లు ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఈ రోజు (మంగ‌ళ‌వారం) నిర్వ‌హించ‌నున్నారు.