Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లి ఇన్విటేష‌న్ రూ.1.5ల‌క్ష‌లు

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:06 AM GMT
అంబానీ పెళ్లి ఇన్విటేష‌న్ రూ.1.5ల‌క్ష‌లు
X
విరాట్ కోహ్లీ.. అనుష్క‌శ‌ర్మ‌ల పెళ్లి వేడుక ఏమో కానీ జాతీయ మీడియా మొద‌లు లోక‌ల్ మీడియా వ‌ర‌కూ అంద‌రూ ఆ ముచ్చ‌ట్ల‌తోనే వార్త‌లు నింపేసే ప‌రిస్థితి. ఇద్ద‌రు సెల‌బ్రిటీల పెళ్లి వేడుక ఫ‌స్ట్ హెడ్ లైన్స్ గా మారిపోవ‌టం కొంత‌కాలంగా సాగుతున్న‌దే. ఇప్పుడు మ‌రో పెళ్లి ముచ్చ‌ట దేశ ప్ర‌జ‌ల‌కు కావాల్సినంత ఆస‌క్తిని.. అతృత‌ను రేకెత్తించ‌టం ఖాయం. విరుష్ ల పెళ్లి వేడుక జోష్ లో నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే.. ఆశ్చ‌ర్య‌పోయేలా చేయ‌టానికి మ‌రో భారీ పెళ్లి వేడుక సిద్ధంగా ఉంది.

దేశంలోనే కాదు.. ఆసియా దేశాల్లోనే సంప‌న్నుడిగా పేరున్న రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన పెళ్లికార్డు ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫోటోను చూస్తే.. పెళ్లి శుఖ‌లేఖ‌ను అంబానీలు భారీగా డిజైన్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

త‌మ ఇంట జ‌రుగుతున్న మొద‌టి పెళ్లి కావ‌టంతో గ్రాండ్ గా ఉండ‌టంతో పాటు.. త‌మ రేంజ్‌కు త‌గ్గ‌ట్లుగా త‌యారు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ముకేశ్ పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ పెళ్లికి సిద్ధ‌మైపోతున్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఒక‌టి వైర‌ల్ గా మారింది. దీని ఖ‌రీదు రూ.1.5ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌న్న అంచ‌నా వినిపిస్తోంది. అంద‌మైన పెట్టెలో శుభ‌లేఖ‌తో పాటు.. ఆభ‌ర‌ణాలున్న బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో జ‌రిగిన పెళ్లిళ్ల‌లో పారిశ్రామిక‌వేత్త గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కుమార్తె వివాహాన్ని చెబుతారు. భారీ ఎత్తున చేప‌ట్టిన ఈ పెళ్లి వేడుక‌కు త‌ల‌ద‌న్నేలా పెళ్లికార్డులోనే అంబానీలు త‌మ రేంజ్ చెప్పేశారు. వైర‌ల్ అవుతున్న పెళ్లి కార్డు కానీ నిజంగానే అంబానీదే అయితే.. పెళ్లి వేడుక‌కు వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్ట‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తుంది. ఒక్కో పెళ్లికార్డుకే రూ.1.5ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడితే.. పెళ్లికి మ‌రెన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తారో చూడాలి.