Begin typing your search above and press return to search.

ముకేష్ ఇంట పెళ్లి సందడిలో క్లారిటీ!!

By:  Tupaki Desk   |   26 Oct 2016 7:24 AM GMT
ముకేష్ ఇంట పెళ్లి సందడిలో క్లారిటీ!!
X
బడా బడా పారిశ్రామిక వేత్తలు - ధనవంతుల ఇంట పెళ్లి సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే పలు సంఘటనలు నిరూపించాయి. ఈ క్రమంలో ఆ పెళ్లిల్ల రేంజ్ ని మరోసారి గుర్తుచేసేలా ఈ మధ్య గాలి జనార్దన్ ఇంట జరిగే వివాహ సందడి కనిపించింది. ఆహ్వాన పత్రిక దగ్గరి నుంచి బాహుబలి మాషిష్మతి రాజ్యాన్ని తలపించే స్థాయిలో ఆర్ట్ డైరక్టర్లతో సెట్లు, వందల సంఖ్యలో వెరైటీ వంటకాలు వెరసి ఖర్చు చిన్నసైజు కాలిక్యులేటర్ కి అందనంత అనే కామెంట్స్ వినిపించాయి!! అప్పటికే ఈ వివాహం గురించి తెల్సినవారంతా... అమ్మో... అని అంటుంటే... ఇక భారతదేశంలోని నెంబర్ వన్ ధనవంతుడు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి అంటే... అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

గత రెండు రోజులుగా ముకేష్ అంబానీ గారాల పట్టి నిషా త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, వీలైతే ఈ ఏడాది నవంబర్ లోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు షికార్లు కొడుతున్నాయి. 24 ఏళ్ల నిషా ప్రేమలో ఉందని, వారి పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నలు ఇచ్చారని, అందుకే వీలైనంత తొందర్లోనే అంబానీ వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయని పుకార్లు షీకారు చేశాయి. అయితే తాజా కథనాల ప్రకారం ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అయితే... ఈ వార్తలో పెళ్లి వరకూ కరెక్టే కానీ... అది ముకేష్ కూతురుది మాత్రం కాదట. ఈ హడావిడి అతని మేనకోడలుకి సంబంధించిందని రిలయన్స్ వర్గాల నుంచి అందుతున్న అధికారిక సమాచారం అని కథనాలు వస్తున్నాయి!!

ఈమేరకు విషయం పూర్తిగా తెలుసుకోకుండా నిషా పెళ్లికి రెడీ అయిందని, ఇండియాలో ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో ఈ పెళ్లి చేసేందుకు ముఖేష్ సిద్ధమైపోయాడని ఒక జాతీయ పత్రిక పేర్కొంది. ఈ పెళ్లికి షారూఖ్ తోపాటు పలువురు సెలబ్రిటీలతో గానాభజనా ఏర్పాటు చేయబోతున్నారని కూడా పేర్కొంది. అయితే ఇదంతా ముకేష్ కూతురు గురించి కాదని, అతని మేనకోడలు గురించిన సంగతనేది తాజా సమాచారం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/