Begin typing your search above and press return to search.

దీక్ష‌కు దిగిన ముద్ర‌గ‌డ‌...ప‌వ‌న్‌ పై విసుర్లు

By:  Tupaki Desk   |   26 Feb 2017 5:01 AM GMT
దీక్ష‌కు దిగిన ముద్ర‌గ‌డ‌...ప‌వ‌న్‌ పై విసుర్లు
X
కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌ తో ఆదివారం కర్నూలులో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. సిరి ఫంక్షన్‌ హాలులో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్నారు. త‌న దీక్ష గురించి ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు కాపు సత్యాగ్రహ దీక్షలు జరగనున్నాయని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఈ దీక్షలు నిర్వహిస్తున్నామ‌ని కర్నూలులో జరిగే దీక్షలో తాను పాల్గొంటాన‌ని ముద్రగడ పద్మనాభం తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా ప్ర‌త్యేక హోదాపై సైతం ముద్ర‌గ‌డ స్పందించారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరును ప‌రోక్షంగా త‌ప్పుప‌ట్టారు. ట్వీట్లు చేయడం, సభలు పెట్టడంతో ప్రత్యేక హోదా రాదని ముద్ర‌గ‌డ‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముందుకొచ్చే పార్టీలు, వ్యక్తులతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాడతామంటున్న వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఒకే గొడుగు కిందకి రావాలని ముద్ర‌గ‌డ కోరారు. ప్రత్యేక హోదా రాకపోతే యువతకి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సీఎం చంద్రబాబు సహా...అన్ని రాజకీయ పార్టీలు, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ వంటి ప్రముఖులకు లేఖలు రాశానన్నారు. అలాగే సెలబ్రిటీలకు కూడా లేఖలు రాశానన్నారు. తలుచుకుంటే సాథ్యంకానిది వుండదని, ప్రత్యేక హోదా కూడా అంతేనని ముద్ర‌గ‌డ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ, తమిళనాడులో జల్లికట్టుకు అనుమ‌తి పొంద‌డం వంటివి ఉద్యమాల ద్వారానే సాధ్యం అయ్యాయన్న విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తించాలని ముద్ర‌గ‌డ విజ్ఞ‌ప్తి చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/