Begin typing your search above and press return to search.

ముద్రగడ దీక్ష..మూడు లేటెస్ట్ డెవలప్ మెంట్స్

By:  Tupaki Desk   |   7 Feb 2016 11:30 AM GMT
ముద్రగడ దీక్ష..మూడు లేటెస్ట్ డెవలప్ మెంట్స్
X
కాపు రిజర్వేషన్ల కోసం మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మానాభంతో దీక్ష విరమింపజేయాలని ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ముద్రగడ దీక్షకు మద్దతు పెరుగుతుండడంతో ఇది ఎలాటి టర్ను తీసుకుంటుందున్న ఆసక్తి నెలకొంటోంది.

ముద్రగడ దీక్షకు మద్దతు తెలిపేందుకు వస్తునన కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు అదుపులోనకి తీసుకున్నారు. ప్రత్తిపాడు వద్ద హర్షకుమార్‌ను అదుపులోనికి తీసుకున్నారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా హర్షకుమార్ కూడా ఆందోళనకు దిగుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

కాగా ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి సోమవారం కిర్లంపూడికి రానున్నట్లు సమాచారం. చిరంజీవి రేపు ఉదయం 11:30 గంటలకు రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి చేరుకుంటారని సమాచారం. చిరంజీవి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, మాజీలు ఈ ఇష్యూలో ఎంటరవుతుండడంతో ముద్రగడ దీక్ష మరింత ముదరనుందని పోలీసులు, ప్రభుత్వం ఆందోళన చెందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి ముద్రగడతో బలవంతంగానైనా దీక్ష విరమింపజేసి ఆయన్ను ఆసుపత్రికి తరలించే ఆస్కారముందని భావిస్తున్నారు.