మీసాల మోనాలిసా అంత రేటు పలికింది

Tue Oct 24 2017 11:45:37 GMT+0530 (IST)

ప్రపంచంలో చాలానే పెయింటింగ్స్ ఉండొచ్చు. కానీ.. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావెన్సీ అద్భుత పెయింటింగ్ మోనాలిసాకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిజానికి ఈ పెయింటింగ్ మీద జరిగేంత చర్చ. ఇప్పటివరకూ ఈ పెయింటింగ్ మీద జరిగిన రీసెర్చ్ మరే పెయింటింగ్ మీద జరగలేదని చెప్పక తప్పదు.మోనాలిసా పెయింటింగ్ మిస్టరీని చేధించేందుకు లక్షలాది మంది నేటికీ ప్రయత్నిస్తుంటారు. మోనాలిసా పెయింటింగ్ మీద వచ్చే రీసెర్చ్ రిపోర్ట్‌లను అమితాసక్తిగా చదివే వారు కోకొల్లలు. అలాంటి మోనాలిసా పెయింటింగ్ ను తొమ్మిది రకాల్లో పెయింటింగ్ వేశాడు ప్రెంచ్- అమెరికన్ ఆర్టిస్ట్ మార్సెల్ డచాప్.

అతగాడు వేసిన మోనాలిసా పెయింటింగ్ లలో ఒక దానికి మీసం.. గడ్డం ఉండటం విశేషం. ఈ తరహా ఆసక్తి ఉన్న 110 పెయింటింగ్స్ ను అమెరికన్ రచయిత బ్రాండిట్ సేల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇందులో మీసాల మోనాలిసా బొమ్మకు ఏకంగా రూ.5 కోట్లు రావటం రికార్డుగా మారింది. మోనాలిసాకు ఉన్న క్రేజ్ ఎంతన్నది తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. అసలు మోనాలిసా మాత్రమే కాదు.. కొసరు మోనాలిసాకూ భారీ డిమాండ్ ఉందే!