Begin typing your search above and press return to search.

దిగ్రేట్ మోడీ ఘ‌న‌త‌: పీక్స్ కు పెట్రోల్‌..డీజిల్‌

By:  Tupaki Desk   |   20 May 2018 11:38 AM GMT
దిగ్రేట్ మోడీ ఘ‌న‌త‌: పీక్స్ కు పెట్రోల్‌..డీజిల్‌
X
న‌న్ను న‌మ్మండి. న‌న్ను ప్ర‌ధానిని చేయండి. దేశం దాటి వెళ్లిన న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌క్కి తెస్తా. దేశ ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తా.. ఇలాంటి చాలానే మాట‌లు చెప్పారు న‌రేంద్ర మోడీ. వీటిని న‌మ్మినోళ్లున్నారు.. న‌మ్మ‌నోళ్లున్నారు. కానీ.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గించే అవ‌కాశం ఉంది. ప్ర‌ధాని పీఠం మీద కూర్చున్న త‌ర్వాత చేసి చూపిస్తాన‌న్న‌ట్లుగా మోడీ సార్ చెప్పారు.

దేశం దాటేసిన న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌క్కి తీసుకొచ్చి ఇవ్వ‌కున్నా.. పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల్ని మాత్రం త‌గ్గిస్తార‌ని అంతా భావించారు.కానీ.. క‌నిష్ఠ స్థాయికి అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గిన‌ప్ప‌టికీ.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గించ‌టానికి ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు మోడీ సాబ్‌. చ‌మురు ధ‌ర‌లు తగ్గిన‌ప్పుడు త‌న మీద బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకొని ఓట్లేసిన ప్ర‌జ‌ల గురించి ఆలోచించ‌ని ప్ర‌ధాని.. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు ఏ మాత్రం పెరిగినా.. చ‌టుక్కున పెంచేస్తున్న ప‌రిస్థితి.

ఇలా ఎడాపెడా పెంచేసిన ఫ‌లితంగా ఒక అరుదైన రికార్డును త‌న పేరిట రాయించుకున్నారు ప్ర‌ధాని మోడీ. త‌న హ‌యాంలో పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జీవిత‌కాల గ‌రిష్ఠానికి చేరుకోవ‌టం ద్వారా.. త‌న‌ను ఎన్నుకున్న ప్ర‌జ‌ల రుణాన్ని వ‌డ్డీతో స‌హా తీర్చుకున్నారని చెప్పాలి.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాదాపు 19 రోజుల పాటు ధ‌ర‌లు పెంచ‌కుండా జాగ్ర‌త్త ప్ర‌ద‌ర్శించిన ఆయిల్ కంపెనీ.. అందుకు సిల్లీ కార‌ణం చెప్పి త‌ప్పించుకుంది. క‌ర్ణాట‌క ఎన్నికలు అలా ముగిశాయో లేదో.. ధ‌ర‌ల పెంపు బెత్తాన్ని తీసుకొని జ‌నం మీద ఎడాపెడా బాద‌టం మొద‌లు పెట్టేశారు.

ఆ రోజు నుంచి వ‌రుస పెట్టి పెంచుతున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు తాజాగా ఆల్ టైం గ‌రిష్ఠానికి చేరుకున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ లీట‌రుకు 33 పైస‌లు పెరిగి లీట‌రు రూ.76.24కు చేర‌గా.. డీజిల్ ధ‌ర‌ల లీట‌రుకు 26 పైస‌ల చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో డీజిల్ లీట‌రు రూ.67.57కు చేరుకుంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత నుంచి రోజువారీగా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని పెంచుతున్నారు. ఏడు రోజుల వ్య‌వ‌ధిలో లీట‌రుకు రూ.1.5 నుంచి రూ.2.50 వ‌ర‌కు పెరిగాయి. ఇక‌.. తాజాగా పెంచిన పెంపుతో వివిధ మ‌హాన‌గ‌రాల్లో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. అధికారాన్ని అప్ప‌గిస్తే ఏదో చేస్తార‌ని బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్న మోడీ మాష్టారు జాతి జ‌నుల‌కు ఎప్ప‌టికి మ‌ర్చిపోలేని బ‌హుమ‌తిని ఇచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.