Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న మిస్టర్ 36(మోడీ) వీడియో..

By:  Tupaki Desk   |   10 Dec 2018 10:26 AM GMT
వైరల్ అవుతున్న మిస్టర్ 36(మోడీ) వీడియో..
X
మోడీ పలు సందర్భాల్లో గాంధీ కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన వీడియో క్లిప్పులను కలిపి రాహుల్ గాంధీ ట్వీట్టర్ వేదికగా ఓ వీడియోను వదిలి మోడీకి సెటైర్లు వేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ మారుతుంది. మిస్టర్ 36(మోడీ) సమర్పించు కామెడీ వీడియో.. దీన్ని మీరంతా చూసి సంతోషిస్తారని భావిస్తున్నా.. దీనిని మీరు చూడటమే కాదు.. మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపించడంటూ రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

ఈ వీడియోలో ప్రధానంగా గాంధీ కుటుంబంపై మోడీ పదేపదే చేసిన ఆరోపణలు తాలుకూ ప్రసంగాలు ఉన్నాయి. నెహ్రూ మొదలు కొని రాహూల్ గాంధీ దాకా వారి పేర్లను మోడీ మళ్లీ మళ్లీ ప్రస్తావించడం కనిపిస్తుంది. రాహుల్ చెప్పిన విషయాలే పదేపదే చెబుతూ వల్లిస్తారనేది మోడీ వ్యాఖ్యల సారాంశం. రాహుల్ గాంధీవి పిల్ల చేష్టలను, ఆయన చెప్పే అసత్యాలను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేయడం ఈ వీడియోలో కన్పిస్తుంది. ఆయన మాట్లాడిన తీరు ప్రజలు పెద్దగా పట్టించుకోవదని, పాతకాలంలో గ్రామఫోన్లు కూడా ఇలాగే పని చేసేవని అలాగే రాహుల్ చెప్పినవే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తుంటారని మోడీ ఎద్దేవా చేసినట్టు ఉంటుంది.

దీనిపై రాహుల్ కు కొంత కొంపమెచ్చినట్టు ఉంది.. అందుకే తాను అరిగిపోయిన రికార్డర్ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రాహుల్ ఈ వీడియోను పోస్టు చేశారు. మోడీనే తమ కుటుంబ సభ్యుల నామం జపం చేస్తూ అరిగిపోయిన రికార్డర్ లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

రాహుల్ ట్వీట్ పై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా మరికొందరు సరదాగా తీసుకుంటున్నారు. మీకోసం వీడియో లింకును అందించడం జరుగుతోంది. మీరు కూడా ఈ వీడియోను చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నామంటూ మోడీ తీరును రాహుల్ ఎండగట్టారు.

వీడియో కోసం క్లిక్ చేయండి