Begin typing your search above and press return to search.

బీకామ్ లో ఫిజిక్స్ `సైకిల్` రైడ్...వైర‌ల్!

By:  Tupaki Desk   |   24 April 2018 5:29 PM GMT
బీకామ్ లో ఫిజిక్స్ `సైకిల్` రైడ్...వైర‌ల్!
X
టీడీపీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్...ఈ పేరు ప‌రిచ‌య‌ముండ‌ని నెటిజ‌న్ ఉండ‌డు. మీడియా, సోష‌ల్ మీడియా, యూట్యూబ్ లో జ‌లీల్ ఖాన్ బాగా పాపుల‌ర్. ఎమ్మెల్యేగా ఆయ‌న సంపాదించిన పాపులారిటీ క‌న్నా....బీకామ్ లో ఫిజిక్స్ అన్న ఒక్క డైలాగ్ తో ఆయ‌న సంపాదించిన పాపులారిటీ ఎక్కువ‌ని చెప్ప‌వ‌చ్చు. తాజాగా, జ‌లీల్ ఖాన్ మ‌రోసారి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నారు. జ‌లీల్ ఖాన్ ...త‌న సైకిల్ తొక్కుడుతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌త్యేక హోదా సాధించ‌డం కోసం టీడీపీ నేత‌లు విజ‌యవాడ‌లో చేప‌ట్టిన సైకిల్ ర్యాలీలో జ‌లీల్ ఖాన్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. ఆ ర్యాలీలో కేశినేని నానితో పాటు మిగ‌తా నేత‌లు స్యయంగా సైకిల్ తొక్కుతుంటే...జ‌లీల్ ఖాన్ మాత్రం సైకిల్ పై కూర్చునేందుకు వారంద‌రిక‌న్నా ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డారు. ఎంచ‌క్కా జ‌లీల్ ఖాన్ సైకిల్ ఎక్కి కూర్చుంటే...ఆయ‌న‌ను సైకిల్ తొక్కించేందుకు గ‌న్ మ్యాన్ ఆప‌సోపాలు ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

బెజ‌వాడ‌లోని మండుటెండ‌లో తెలుగు త‌మ్ముళ్లు సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే, జ‌లీల్ ఖాన్ మాత్రం ఏదో ర్యాలీ కాబ‌ట్టి నామ్ కా వాస్తే సైకిల్ పై కూర్చున్నారు...ఆయ‌న భార‌మంతా గ‌న్ మ్యాన్ మోస్తూ....జ‌లీల్ ఖాన్ ను సైకిల్ తొక్కించారు. ఎలాగోలా అష్ట‌క‌ష్టాలు ప‌డుతూ జ‌లీల్ ఖాన్...సైకిల్ ర్యాలీని అతి క‌ష్టం మీద పూర్తి చేశారు. జ‌లీల్ ఖాన్ తో పాటు ఆ సైకిల్ ను బ్యాలెన్స్ చేయ‌లేక ఆయ‌న గ‌న్ మ్యాన్ కు చుక్క‌లు క‌నిపించాయి. మండుటెండ‌లో ఆ భారీ కాయాన్ని సైకిల్ తొక్కించిన గ‌న్ మ్యాన్ ను చూసి అక్క‌డున్న‌వారు జాలి ప‌డ్డారు. పాపం చేసేదేం లేక ఉసూరుమంటూ సైకిల్ ను తోసుకుంటూ...అలా ముందుకు పోయాడా గ‌న్ మ్యాన్. అయితే, సైకిల్ తొక్కేందుకు జ‌లీల్ ఖాన్ శ‌రీరం స‌హ‌క‌రించ‌లేదా...లేదంటే ఆయ‌న‌కు సైకిల్ తొక్క‌డం రాదా అన్నది ప్ర‌శ్నార్థ‌కం. ఏది ఏమైనా త‌న‌దైన శైలిలో జ‌లీల్ ఖాన్ ...మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. ఆయ‌న‌పై నెటిజ‌న్లు ర‌క‌రకాల సెటైర్లు వేస్తున్నారు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి