Begin typing your search above and press return to search.

ట్రంప్ నాటి మాట.. నేటి వైరల్!

By:  Tupaki Desk   |   28 Sep 2016 12:22 PM GMT
ట్రంప్ నాటి మాట.. నేటి వైరల్!
X
ఒక రోజు అటూ ఇటూ అవ్వొచ్చు కానీ తెలిసో తెలియకో ఏ తప్పు చేసినా ఫలితం అనుభవించక తప్పదు అని తాజాగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ విషయంలో రుజువైంది! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నప్పటి నుంచీ వీటి వాడీ వేడీ పూర్తిగా పెరిగిపోయాయి. ఈ విషయాలు తాజాగా ప్రపంచం మొత్తం తెలుస్తున్నాయి. అయితే ట్రంప్ కు ఈ నోటి - - - ఈ ఎన్నికల సమయంలోనే వచ్చిందే కాదు, గతం నుంచీ ఉంది. ఆ గత అనుభవానికి సంబందించిన ఒక వీడియో లేటెస్ట్ గా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ట్రంప్ మిస్ యూనివర్స్ ని పట్టుకుని ఎన్నేసి మాటలంది స్పష్టంగా ఉంది.

1996లో వెనిజులా సుందరి ఎలిషియా మచాడో 'విశ్వసుందరి' గా ఎంపికైంది. ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆమె కొంతకాలం తర్వాత కాస్త బరువు పెరిగింది. దీంతో ఆమెను వెంటాడి మరీ ట్రంప్‌ తనదైన శైలిలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆమెను మిస్‌ పిగ్గీ (పంది) అని, ఈటింగ్‌ మిషిన్‌ (తిండిబోతు యంత్రం) అని నానా రకాల దుర్భాషలడాడు. అయితే నాటి వ్యాఖ్యల ఫలితం ట్రంప్ కు నేడు దక్కింది. డొనాల్డ్‌ ట్రంప్‌ - హిల్లరీ క్లింటన్‌ తాజాగా పాల్గొన్న 'బిగ్‌ డిబేట్‌'లో ట్రంప్‌ మిస్ యూనివర్స్ విషయంలో చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను హిల్లరీ విడుదల చేశారు. ఈ డిబేట్‌ సందర్భంగా ఆ వీడియోను చూపిస్తూ మహిళలపై ఆయనకున్న గౌరవం ఇది అంటూ కడిగిపారేశారు హిల్లరీ. "మహిళలను పందులు - బద్ధకస్తులు - తిండిపోతులూ అని తిడతాడు.. వారు గర్భవతులు కావడం ఉద్యోగాలు ఇచ్చేవాళ్లకు తలనొప్పి అని అంటాడు.. పురుషులతో సమానంగా పనిచేస్తే తప్ప వారికి సమాన జీతం పొందే అర్హత లేదంటాడు.. అందాల పోటీలో పాల్గొన్న మహిళపై వికృత వ్యాఖ్యలు చేస్తాడు.. అంటూ ట్రంప్‌ తీరును హిల్లరీ తూర్పారబట్టారు.

తాజాగా నాటి ట్రంప్ వ్యాఖ్యల విషయాలు మరోసారి వెలుగులోకి రావడంతో ఈ వెనిజుల విశ్వసుందరి ఎలిషియా మచాడొ స్పందించి.. తనను ట్రంప్‌ దారుణంగా అవామానించాడని చెబుతూ ఆ రోజుల్ని గుర్తుచేసుకుంది. తాజాగా అమెరికా పౌరురాలిగా మారి ఓటు హక్కు పొందిన ఎలిషియా మచాడో... తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకే ఓటు వేస్తానని తెలిపింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/