Begin typing your search above and press return to search.

మిస్ అమ‌రావ‌తి కిరీటం ఎవరికీ?

By:  Tupaki Desk   |   27 Aug 2016 1:30 PM GMT
మిస్ అమ‌రావ‌తి కిరీటం ఎవరికీ?
X
మిస్ యూనివ‌ర్స్‌ - మిస్ ఇండియాల మాదిరిగానే మిస్ లోక‌ల్ వ‌చ్చేసిన విష‌యం కొత్తేంకాదు! ఈ క్ర‌మంలో గ‌తంలో మిస్ విజ‌య‌వాడగా 2015లో శ్రీస‌త్య ఎంపికైన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు మిస్ అమ‌రావ‌తి కోసం విజ‌య‌వాడ‌ - గుంటూరుల్లో కాంపిటీష‌న్ ఓ రేంజ్‌ లో సాగుతోంది. అమ‌రావ‌తి అంటే కూడా తెలిసిందే. ఏపీ రాజ‌ధాని దీనికి ఎంతో ప్రాధాన్యం పెంచేందుకు సీఎం చంద్ర‌బాబు కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మిస్ అమ‌రావ‌తిగా ఎంపికైన యువ‌తికి ఉండే క్రేజ్ అంతా ఇంతాకాదు! ఇక‌, ఆమె అతి పేద్ద సెల‌బ్రిటీగా కూడా మారిపోనుంది. దీంతో డ‌బ్బుకు డ‌బ్బు.. పేరుకు పేరు రావ‌డం ఖాయం!

దీంతో మిస్ అమ‌రావ‌తి కాంపిటీష‌న్ ప్ర‌క‌టించగానే వేల సంఖ్య‌లో ఎంట్రీలు వ‌చ్చిప‌డ్డాయి. దీంతో వీరిని ఎంపిక చేయ‌డం మిస్ అమ‌రావ‌తి పోటీల‌ని నిర్వ‌హిస్తున్న ఫ్యూచర్ ఆల్ - సాయి క్రియేటివ్ ఎంటర్ టెయిన్ మెంట్స్ కు పెద్ద భారంగా ప‌రిణ‌మించింద‌ని నిర్వాహ‌కులు స్ప‌ష్టం చేశారు. ఇటు విజ‌య‌వాడ నుంచి అటు గుంటూరు నుంచి కూడా భామ‌లు మిస్ అమ‌రావ‌తి కిరీటం కోసం పోటీ ప‌డ్డార‌ట‌. దీంతో వీరిని వివిధ ప‌రీక్ష‌ల త‌ర్వాత మొత్తంగా ఇటు విజ‌య‌వాడ‌లో 11 మందిని, అటు గుంటూరులో 11 మందిని ఎంపిక చేశారు నిర్వాహ‌కులు.

ఇక‌, వీరికి అక్టోబ‌ర్‌ లో ఫైన‌ల్‌ గా ర్యాంప్ టెస్ట్ పెట్టి.. మిస్ అమ‌రావ‌తిని సెల‌క్ట్ చేయ‌నున్నార‌న్న మాట‌! దీంతో ఈ 22 మంది యువ‌తులు త‌మ తెలివితేట‌ల‌ను - మేథ‌స్సును - ఐక్యూను ప‌దును పెట్టుకునే ప‌నిలో ప‌డ్డార‌ని స‌మాచారం. ఎందుకంటే.. మిస్ అమ‌రావ‌తి కావాలంటే నాజూకైన శ‌రీరమే కాదు... చాక‌చ‌క్యంగా మాట్లాడ‌గ‌లిగిన నేర్పు, ఎదుటివారికి ధీటైన స‌మాధానం చెప్ప‌గ‌ల కూర్పు కూడా అవ‌స‌ర‌మే! మ‌రి వీరిలో ఎవ‌రు అన్ని రంగాల్లోనూ ఫ‌స్ట్ ఉండి ఈ మిస్ అమ‌రావ‌తి కిరీటం ద‌క్కించుకుంటారో? అక్టోబ‌ర్ వ‌ర‌కు ఈ స‌స్పెన్స్ కొన‌సాగుతుంది.