ఎట్టకేలకు సినీ పరిశ్రమకు కేసీఆర్ పరిష్కారం చూపాడు

Sat Apr 21 2018 21:45:06 GMT+0530 (IST)

గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు అందరి దృష్టిని వెండితెర పరిశ్రమ వైపు పడేలా చేసిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ సహా సినీ రంగంలోని పలువురు ప్రముఖులు తమ ఆందోళనను ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఉదంతంలో తెలంగాణ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు టీ ప్రభుత్వం స్పందించారు. రాష్ట్ర సచివాలయంలో సినీ పరిశ్రమ ప్రముఖులు ‘మా’ ప్రతినిధులతో సినిమాటోశగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పోలీసులు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. సమావేశంలో సిను నీ రంగంలో వివాదాలు లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్చిస్తున్నారు.గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో శనివారం ఉదయం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి చర్చించారు. అన్నపూర్ణ స్డూడియో సెవెన్ ఎకర్స్లో జరిచాగిన ఈ సమావేంలో ప్రముఖ నిర్మాతలు - దర్శకులు - నిర్మాతల మండలి - నటీనటుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు గంటల పాటు జరిగిన విస్తృతస్థాయి భేటీలో కాస్టింగ్ కౌచ్ - టాలీవుడ్ సమస్యలపై చర్చించినట్టు తెలుస్తుంది. సమావేశం తర్వాత సినీ ప్రముఖులు ఎవరు మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు.

ఈ భేట అనంతరం మంత్రి తలసాని సాయంత్రం 4గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా సినిమా రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు వంటి అంశాలపై సినీరంగ ప్రముఖులు - పోలీసు ఉన్నతాధికారులు - కార్మిక శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్: మహిళలు నటులు.. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని.. సినీరంగంలో నెలకొన్న పరిణామాలపై చర్చించామన్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. చిత్ర నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు సమన్వయకర్తలు లేకుండా చూస్తామని తలసాని హామీ ఇచ్చారు. నటులకు మేనేజర్ ద్వారానే నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు చేస్తామని చెప్పారని ఆయన అన్నారు. మహిళలపై వేధింపులు - లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదన్న మంత్రి.. ఫిర్యాదుల కోసం ఎఫ్డీసీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. నటన శిక్షణా కేంద్రాలను ప్రక్షాళన చేస్తామన్నారు. ఇక వివాదాన్ని నిలిపివేయాలని పరిశ్రమను - మీడియాను మంత్రి కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సినీ పెద్దలు చెప్పారని మంత్రి మీడియాకు తెలిపారు. త్వరలోనే టాలీవుడ్ లో క్యాష్ కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. మహిళలు - నటులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని పరిశ్రమను - మీడియాను కోరుతున్నానని తలసాని అన్నారు.