Begin typing your search above and press return to search.

పవన్‌ పై అశోక్ కోపం ఎందుకో.. ?

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:45 PM GMT
పవన్‌ పై అశోక్ కోపం ఎందుకో.. ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై కేంద్ర మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు పరోక్ష విమర్శలు చేశారు. టీడీపీని ఓడించే శక్తి ఉంటే ఎవరు కాదంటారని ఆయన ప్రశ్నించారు. పనిలోపనిగా ఆయన వైసీపీ - జగన్‌ పైనా విమర్శలు చేశారు. సాధారణంగా అశోక్ ఎంతో తీవ్రమైన సందర్భాలుంటే తప్ప అశోక్ ఎవరిపైనా విమర్శలకు దిగరు.. అలాంటిది పవన్ ఏదో మొహమాటానికి టీడీపీపై చేసిన విమర్శలపై ఆయన స్పందించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎవరిపైనైనా విరుచుకుపడే టీడీపీ నేతలంతా మౌనంగా ఉంటున్న వేళ అశోక్ ఇలా పవన్ పై విమర్శలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీని అన్నందుకు కంటే బీజేపీని అన్నందుకే ఆయనకు ఆగ్రహం వచ్చిందని ఆయన విమర్శకులు అంటున్నారు.

ఓడించే శక్తి ఉంటే ఎవరు కాదంటరని.. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆశోక్ గజపతిరాజు అన్నారు. అయితే అదే సమయంలో గెలుపు ఓటములు కూడా సహజమేనని ఆయన చెప్పారు. తాను 8 దఫాలు ఎన్నికల్లో పోటీ చేస్తే 7 దఫాలు విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మరోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. పని చేయమంటారు. అసెంబ్లీకి వెళ్ళమంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ ఓ వేదికగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం వల్ల ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. బాధ్యత ఉన్న వారినే ప్రజలు ప్రోత్సహిస్తారని అన్నారు. తమ కుటుంబం పేదలకు సేవ చేసేందుకు ఇష్టపడుతుందని.. సేవ తనకు ఆనందాన్ని ఇస్తుందని... కానీ, కొందరికి మాత్రం మద్యం పోయించడంలో ఆనందం ఉందంటూ పరోక్షంగా సొంత జిల్లాలో తన ప్రత్యర్ధి బొత్స సత్యనారాయణపై విమర్శలు చేశారు.