Begin typing your search above and press return to search.

దారుణం.. ఫ్లైట్ లో మైన‌ర్ పై రేప్!

By:  Tupaki Desk   |   22 May 2019 11:56 AM GMT
దారుణం.. ఫ్లైట్ లో మైన‌ర్ పై రేప్!
X
దారుణం చోటు చేసుకుంది. ఊహ‌కు అంద‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ వైనం చూస్తే.. ఎవ‌రిని ఎట్టి ప‌రిస్థితుల్లో న‌మ్మ‌కూడ‌ద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఎన్జీవో పేరుతో పేద‌ల‌కు అవ‌స‌ర‌మైన ఆరోగ్య అవ‌స‌రాల‌కు ఉచితంగా విమానాన్ని న‌డిపే ఒక పెద్దాయ‌న చేసిన పాడు ప‌ని ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఆరోగ్య అవ‌స‌రాల కోసం పేద‌ల్ని విమానాల్లో త‌ర‌లించ‌టం.. ఉచితంగా విమానాన్ని న‌డిపే ప‌ని చేసే మ‌ల్టీ మిలియ‌నీర్ బుద్ధి వ‌క్రీక‌రించింది. అత‌గాడు చేసిన పాడు ప‌నికి విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అమెరికాకు చెందిన కోటీశ్వ‌రుడు 53ఏళ్ల స్టీఫెన్ బ్రాడ్లీ మెల్ విమానాల్ని న‌డ‌ప‌టంలో శిక్ష‌ణ ఇస్తుంటాడు. ఒక ఎన్టీవోను నిర్వ‌హిస్తుంటాడు. అలాంటి ఆయ‌న త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన 15 ఏళ్ల చిన్నారికి ఫ్లైట్ ను ఎలా న‌డ‌పాల‌న్న దానిపై శిక్ష‌ణ ఇచ్చే పేరుతో విమానాన్ని టేకాఫ్ తీసుకున్నాడు.

గాల్లో విమానం ఎగురుతుండ‌గా.. విమానాన్ని ఆటోప్లేలో ఉంచి.. ఆ చిన్నారిపైన అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ పాడు ప‌ని చేసిన అత‌గాడికి పెళ్లై.. ముగ్గురు పిల్ల‌లు ఉన్నార‌ని.. త‌న కుమార్తె కంటే త‌క్కువ వ‌య‌సున్న బాలిక‌తో ఇంత దారుణ‌మైన ప‌ని ఎలా చేస్తారంటూ కోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది.

విమానంలో త‌న ప‌ట్ల పైలెట్ క‌మ్ కోచ్ చేసిన పాడు ప‌నిని ఆ చిన్నారి త‌న త‌ల్లికి చెప్ప‌టంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో.. స్టీఫెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌న్ని కోర్టుకు హాజ‌రుప‌ర్చ‌గా.. తాను చేసిన త‌ప్పును ఒప్పుకొన్నాడు. నేరాన్ని అంగీక‌రించాడు. ఇదిలా ఉంటే.. త‌న క్ల‌యింట్ ఇప్ప‌టికే ఎన్నో సామాజిక కార్య‌క్ర‌మాలు చేశార‌ని.. ఆయ‌న చేసిన త‌ప్పును క్ష‌మించి వ‌దిలివేయాల‌ని నిందితుడి త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టులో వాదించారు. ఆయ‌న‌కు కోర్టు ఇప్ప‌టివ‌ర‌కూ శిక్ష విధించ‌లేదు. న్యాయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. నిందితుడికి ఐదేళ్ల వ‌ర‌కూ జైలుశిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇలాంటివాడికి క‌ఠిన శిక్ష విధించాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది.