Begin typing your search above and press return to search.

పాకెట్ పాలు వాడ‌తారా? త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే!

By:  Tupaki Desk   |   12 Dec 2017 10:30 PM GMT
పాకెట్ పాలు వాడ‌తారా? త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే!
X
ఇవాళ రేప‌టి రోజున పాల పాకెట్ వాడ‌నోళ్లు అస్స‌లు క‌నిపించ‌రు. ఇంకా చెప్పాలంటే.. ఒకేసారి మూడు నాలుగు పాకెట్లు తెచ్చుకొని ఫ్రిజ్ ఈప్‌లో పెట్టేసుకొని మ‌రీ వాడే వారు బోలెడంత మంది క‌నిపిస్తారు. మ‌రి.. మ‌నం వాడుతున్న పాలు ఎలాంటివి? నాణ్య‌త ప‌రంగా ఏమైనా ఇబ్బంది ఉందా? పాలు కాచేట‌ప్పుడు అదోలాంటి వాస‌న కొన్ని పాల పాకెట్ల‌కు ఎందుకు వ‌స్తుంది? క‌్వ‌శ్చ‌న్ల మీద క్వ‌శ్చ‌న్లు. ఆన్స‌ర్లు చెప్పే వారు క‌నిపించ‌రు.

ఇలాంటి డౌట్ల‌పై దృష్టి సారించింది ఒక ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌. ఆశ్చ‌ర్యంతో పాటు.. ఆందోళ‌న క‌లిగించే నిజాల్ని బ‌య‌ట‌కు తీసింది. ఆ కంపెనీ.. ఈ కంపెనీ అన్న తేడా లేకుండా నాణ్య‌త విష‌యంలో మార్కెట్లో ఉన్న పాల పాకెట్ల‌లో 45శాతం నాణ్య‌తా ప్ర‌మాణాల ప్ర‌కారం లేవ‌న్న విష‌యం వెల్ల‌డైంది. హానికర‌మైన ర‌సాయ‌నాలు పాల పాకెట్ల‌లో క‌లసి ఉన్న విష‌యాన్ని తేల్చింది.

ఏదో మాట వ‌ర‌స‌కు కాకుండా మార్కెట్లో అమ్ముడ‌య్యే పాల‌పాకెట్ల శాంపిల్స్ సేక‌రించి.. వాటిని ప్ర‌భుత్వ లేబొరేట‌రీలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. తుది ఫ‌లితం ఏమిటంటే.. పాకెట్ పాలు అమ్మే బ్రాండ్ల‌లో 45 శాతం ఉత్ప‌త్తులు పాలు కావ‌ని.. రోగాలు తీసుకొచ్చే పాలుగా తేల్చారు. పాల పాకెట్ల‌ను నిత్యం వాడితే ఆరోగ్యం క్షీణించి వ్యాధుల బారిన ప‌డ‌టం ఖాయ‌మ‌ని తేల్చారు.

ఇంత‌కీ పాకెట్ పాలలో ఏం ఉంది? అన్నది చూసిన‌ప్పుడు ప్ర‌మాద‌క‌ర‌మైన ఇ-కోలి..సాల్మోనెల్లా లాంటి ప్ర‌మాద‌క‌ర బ్యాక్టీరియా ఉన్న‌ట్లుగా తేల్చారు. ఈ పాలు తాగితే పోష‌కాల సంగ‌తి త‌ర్వాత రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించ‌టం ఖాయ‌మ‌ని తేలిన‌ట్లు పేర్కొన్నారు.

తాము శాంపిల్ గా సేక‌రించిన పాల పాకెట్ల‌ను ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ప్పుడు కొన్ని పాల పాకెట్ల‌లో కొవ్వు లాంటి ప‌దార్థాలు నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు లేవ‌ని.. యూరియా.. గ్లూకోజ్‌.. హైడ్రోజ‌న్ పెరాక్సైడ్.. సోడా లాంటివి స్వ‌ల్ప మోతాదులో ఉన్న‌ట్లుగా వెల్ల‌డైంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 57 ర‌కాల పాల బ్రాండ్లు అమ్ముడ‌వుతున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయా సంస్థ‌లు ఒక్కో లీట‌రు పాల‌ను వెన్న‌శాతాన్ని బ‌ట్టి రూ.40 నుంచి రూ.54 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నాయి. డెయిరీల మ‌ధ్య నెల‌కొన్న పోటీ దృష్ట్యా నాణ్య‌త‌ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ప‌లు డెయిరీలు పాల పౌడ‌ర్ ను క‌లిపి పాలు త‌యారు చేస్తున్నాయ‌ని.. ప‌రిమితికి మించి హైడ్రోజ‌న్ పెరాక్సైడ్.. కాస్టిక్ సోడాను వినియోగిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌ల‌తో పాటు.. ప్ర‌జల ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేసే వైర‌స్‌.. బ్యాక్టీరియాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా తేలింది. ఈ స‌మాచారం ఆందోళ‌న క‌లిగించ‌ట‌మే కాదు.. భ‌యానికి గురి చేయ‌టం ఖాయం. మ‌రింత దారుణ‌మైన దుర్మార్గంపై ప్ర‌భుత్వాలు.. అధికారులు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిస్తే బాగుండు.