Begin typing your search above and press return to search.

ప్రకాశం ప్రజల్ని వణికించిన భూప్రకంపనలు

By:  Tupaki Desk   |   28 Nov 2015 6:56 AM GMT
ప్రకాశం ప్రజల్ని వణికించిన భూప్రకంపనలు
X
గత కొద్ది నెలలుగా భూప్రకంపలు తరచూ చోటు చేసుకుంటూ పలు ప్రాంతాల్లోని ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజా అలాంటి భయాందోళనలకు గురయ్యారు ప్రకాశం జిల్లా ప్రజలు. శనివారం ఉదయం ఒక్కసారిగా భూప్రకంపనలు చోటు చేసుకోవటంతో జిల్లాలోని పలు ప్రాంతాలు వణికాయి. ఉన్నట్లుండి భూప్రకంపనలు చోటు చేసుకోవటం.. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయానికి గురయ్యారు. కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకోవటం.. దీంతో భయంతో ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు. మరోవైపు.. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న భూప్రకంపల వివరాలు తెలుసుకున్న వివిధ ప్రాంతాల వారు ఆందోళన చెందుతూ.. తమ వారికి ఫోన్లు చేసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.