Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు మృతి!

By:  Tupaki Desk   |   16 Oct 2018 10:39 AM GMT
మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు మృతి!
X
ఈ రోజు కంప్యూట‌ర్లు వాడ‌నోళ్లు చాలా త‌క్కువ మందే ఉంటారు. నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ కంప్యూట‌ర్ తో కుస్తీ ప‌ట్ట‌నోళ్లు త‌క్కువ‌మంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కంప్యూట‌ర్ల వాడ‌కాన్ని పూర్తిగా మార్చేసిన ఘ‌న‌త క‌చ్ఛితంగా మైక్రోసాఫ్ట్ కే ద‌క్కుతుంది. కంప్యూట‌ర్ ను జ‌న‌జీవితాల‌కు ద‌గ్గ‌ర‌గా తెచ్చిన మైక్రోసాఫ్ట్ కు ఈ రోజు విషాద దినం.

ఎందుకంటే.. ఆ కంపెనీకి స‌హ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్న పాల్ ఎలెన్ సోమ‌వారం క‌న్నుమూశారు. క్యాన్స‌ర్ కార‌ణంగా గ‌డిచిన కొద్దికాలంగా తీవ్ర అస్వ‌స్థ‌తో ఉన్న ఆయ‌న‌.. ఆసుప‌త్రిలో మ‌రణించారు. మైక్రోసాఫ్ట్ పేరు విన్నంత‌నే బిల్ గేట్స్ పేరు గుర్తుకు వ‌స్తుంది. అలాంటి గేట్స్ తో క‌లిసి ఎలెన్ పాల్ 1975లో మైక్రోసాఫ్ట్ ను స్టార్ట్ చేవారు.

మైక్రోసాఫ్ట్ లో వాటాతో స‌హా 20.2 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచ సంప‌న్నుల్లో 46వ స్థానంలో నిలిచిన ఎలెన్ 1986లో ఉల్క‌న్ ఇంక్ అనే సంస్థ‌ను స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఎలెన్ మ‌ర‌ణ‌వార్త‌పై మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల స్పందించారు.

ఎన్నో అనుభూతులు.. మ‌రెన్నో అనుభ‌వాలు మిగిల్చిన ఆయ‌న నుంచి తానెంతో నూర్చుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఆయ‌న‌లోని ఉత్సాహం మైక్రోసాఫ్ట్ కుటుంబంలో నూత‌న ఉత్తేజాన్ని నింపింద‌ని.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని స‌త్య నాదెళ్ల పేర్కొన్నారు. ఈ రోజున కంప్యూట‌ర్లు వాడే వారంతా.. ఎలెన్ మ‌ర‌ణాన్ని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆయ‌నే లేకుంటే.. ఈ రోజున టెక్నాల‌జీ ఈ స్థాయిలో ఉండేదంటారా?