Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్ శుభవార్త.. హెచ్ డీఎఫ్ సీ దుర్వార్త

By:  Tupaki Desk   |   22 April 2017 8:12 AM GMT
మైక్రోసాఫ్ట్ శుభవార్త.. హెచ్ డీఎఫ్ సీ దుర్వార్త
X
రెండూ వేర్వేరు రంగాల్లో దిగ్గజ సంస్థలు. అందులో ఒకటి తన ఉద్యోగులకు శుభవార్త చెప్పగా ఇంకోటి తీవ్ర ఆవేదన కలిగించే వార్తను చెప్పింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు సెలవుల విషయంలో చాలా మేలు చేసింది. కుటుంబ సభ్యుల్లో ఎవరి ఆరోగ్య పరిస్థితి అయినా విషమంగా ఉంటే... వారి వెన్నంటి ఉండేందుకు సంరక్షకుడి సెలవు కింది నాలుగు వారాల పెయిడ్ లీవ్ ప్రకటించింది. ఈ సెలవు సమయంలో పూర్తి వేతనాన్ని చెల్లించనుంది.

కుటుంబ సభ్యుల జాబితాలో జీవిత భాగస్వామి - తల్లిదండ్రులు - సంతానం - తోబుట్టువులు - అత్తామామలు - తాతయ్య - నాన్నమ్మ - అమ్మమ్మలు వంటి వారిని చేర్చింది. గత సంవత్సరం కూడా ప్రసూతి సెలవుల కింద మహిళలకు 26 వారాల సెలవును మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. పురుష ఉద్యోగులు కూడా ఆరు వారాల పితృత్వ సెలవును పెట్టుకోవచ్చని తెలిపింది.

మరోవైవపు పెరుగుతున్న ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ కారణాలతో పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న వేళ - ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డీఎఫ్సీ సైతం అదే దారిలో నడిచింది. గడచిన రెండో త్రైమాసికంలో ఏకంగా 6,096 మంది ఉద్యోగులను తొలగించింది. డిసెంబర్ 2016లో సంస్థలో 90,421 మంది ఉద్యోగులు ఉండగా, మార్చి 2017 నాటికి ఈ సంఖ్య 84,325కు తగ్గింది. సంస్థ చరిత్రలో మూడు నెలల కాల వ్యవధిలో ఇంత మంది ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. అంతకుముందు డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలోనూ సంస్థ 4,581 మందిని తగ్గించుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/