Begin typing your search above and press return to search.

రేపటి నుంచే హైటెక్ సిటీకి మెట్రో

By:  Tupaki Desk   |   19 March 2019 7:55 AM GMT
రేపటి నుంచే హైటెక్ సిటీకి మెట్రో
X
ఎన్నాళ్లుగానే సాఫ్ట్ వేర్, ఇతర ఉద్యోగులు వేచి చూసిన కాలం వచ్చేసింది. హైటెక్ సిటీకి మెట్రో రైలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 9.15 గంటలకు అమీర్ పేట మెట్రో స్టేషన్ లో గవర్నర్ నరసింహన్ జెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు.

నిజానికి ఈ రైల్ ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ కానీ కేటీఆర్ చేతులమీదుగా చేద్దామని అనుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా కొందరు తెలంగాణ ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొని ప్రారంభోత్సవం చేస్తున్నారు.

సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులను అనుమతిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ వరకు మెట్రో ప్రారంభం కావడంతో అటు వైపు భారీగా ఉన్న పరిశ్రమలు, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ, ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది.

ఈ కారిటార్ తో మొత్తం 56 కి.మీల మేర మెట్రో అందుబాబులోకి రానుంది. ఇప్పటికే 46 కిమీల మెట్రో ప్రయాణంతో దేశంలోనే హైదరాబాద్ మెట్రో రెండో అతిపెద్ద కారిడార్ గా స్థానంలో నిలిచింది. తొలి దశ ప్రతిపాదించిన 72 కిమీలలో మరో 15 కి.మీలు హైటెక్ సిటీ కారిడార్ తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 9 కి.మీలు నిర్మాణంలో ఉంది. ఈ ఏడాది చివరలో అది పూర్తి కానుంది. మరో 6 కి.మీలు పాతబస్తీ మార్గంలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు.