Begin typing your search above and press return to search.

కోడెల చుట్టూ ఉచ్చు బిగుస్తున్న‌ట్టే!

By:  Tupaki Desk   |   11 Jun 2019 7:15 AM GMT
కోడెల చుట్టూ ఉచ్చు బిగుస్తున్న‌ట్టే!
X
న‌వ్యాంధ్ర‌కు నూత‌న ముఖ్య‌మంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి టీడీపీ స‌ర్కారు హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ అక్ర‌మాల‌న్నింటిలోకి స్పీక‌ర్ హోదాలో టీడీపీ సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద్‌ - ఆయ‌న త‌న‌యుడు - కూతురు కొన‌సాగించిన ట్యాక్స్ వ‌సూళ్లు అగ్ర‌భాగ‌న నిలిచాయి. కోడెల ట్యాక్స్ పేరిట బాగానే పాపుల‌ర్ అయిన ఈ వ్య‌వ‌హారంపై ఇప్పుడు కొంద‌రు బాధితులు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదులు చేశారు. ఈ క్ర‌మంలో కోడెల కుమారుడు శివ‌రాం - కూతురు విజ‌య‌ల‌క్ష్మీల‌పై కేఏసులు కూడా న‌మోద‌య్యాయి. గుంటూరు జిల్లాలోని కోడెల నియోజ‌క‌వ‌ర్గం స‌త్తెన‌ప‌ల్లి - న‌ర‌స‌రావుపేట నియోక‌జ‌వర్గాల్లో కోడెల ట్యాక్స్ వ‌సూలు చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోప‌ణ‌లే ఆధారంగా కోడెల‌పై చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధం అవుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి కీల‌క త‌రుణంలో వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి రెండు రోజుల క్రితం సంచ‌ల‌నాత్మ‌క ట్వీట్ చేశారు. *ప్రజలు - వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులే. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి* అంటూ సాగిన ఈ ట్వీట్ ను చూస్తుంటే... ఈ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే మాత్రం కోడెల‌కు చిక్కులు త‌ప్ప‌వ‌న్న వాద‌న వినిపిస్తోంది. కే ట్యాక్స్ పేరిట ప్ర‌జ‌లను వేధించిన కోడెల ఫ్యామిలీతో పాటు వారికి స‌హ‌క‌రించిన అధికారుల‌ను కూడా వ‌దిలిపెట్టేది లేద‌న్న కోణంలో సాయిరెడ్డి చేసిన ట్వీట్ పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది.

ఇలాంటి త‌రుణంలో జ‌గ‌న్ కేబినెట్ లో కీల‌క మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మేక‌పాటి గౌంత‌రెడ్డి కూడా నేటి ఉద‌యం సంచ‌ల‌న కామెంట్ చేశారు. కోడెల‌పై త‌మ‌కు ఎలాంటి వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు లేవ‌ని - కోడెల ట్యాక్స్ పేరిట ఆయ‌న కుటుంబం పాల్ప‌డిన వ‌సూళ్లే... ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. గ‌డ‌చిన ఐదేళ్లలో కోడెల ఫ్యామిలీ సాగించిన దురాగ‌తాలే కోడెల‌ను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయ‌ని కూడా గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. కోడెల కొడుకు - కూతురుపై కేసుల న‌మోదు - త‌మ‌కేమీ క‌క్ష లేదంటూ గౌతంరెడ్డి వ్యాఖ్య‌ల‌ను చూస్తుంటే... కోడెల చుట్టూ ఉచ్చు బిగుస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.