Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల అప్పులు ప్రాణం తీశాయి

By:  Tupaki Desk   |   24 Nov 2015 2:13 PM GMT
ఎన్నిక‌ల అప్పులు ప్రాణం తీశాయి
X
రాజ‌కీయాలంటే ఒక‌ప్పుడు సేవకు పెట్టింది పేరు. రాజ‌కీయాల్లోకి రావాల‌నుకునే వారు నిష్క‌ళ్మ‌ష హృద‌యంతో ప్ర‌జా సేవే ల‌క్ష్యంగా వ‌చ్చేవారు. కానీ ఇపుడు ట్రెండ్ మారింది. అడ్డ‌గోలు సొమ్ము సంపాద‌నే ల‌క్ష్యం....అవినీతే అందుకు మార్గం అయింది. ఈ క్ర‌మంలో రాజ‌కీయాలు బాగా ఖ‌రీదైపోయాయి. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డాలంటే ఓట్ల కంటే కోట్లను న‌మ్ముకోవాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఇలా గెలుపు కోసం అప్పులు చేసిన ఓ స‌ర్పంచ్ ఆఖ‌రికి అసువులు బాశారు. ఆ స‌ర్పంచ్ మ‌హిళ కావ‌డం పైగా అర‌వై ఏళ్ల వ‌య‌స్సుండ‌టం కావ‌డం అత్యంత బాధాక‌రం.

రాజ‌కీయాల్లోని ప్ర‌స్తుత ప‌రిస్థితి అద్దంప‌ట్టే ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ర్టంలోని మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలో జ‌రిగింది. జిల్లాలోని కోయిల్‌ కొండ మండలం బూర్గుపల్లి గ్రామ స‌ర్పంచ్ ఎన్నిక‌ల కోసం ఎన్నిక‌ల సంద‌ర్భంగా దేవ‌మ్మ భారీగా ఖ‌ర్చుపెట్టారు. ఈ నోట్ల‌కు తోడు ఓట్లు కూడా క‌లిసి రావ‌డంతో ఆమె స‌ర్పంచ్‌ గా గెలుపొందారు. అయితే కోరుకున్న ప‌ద‌వి ద‌క్కింది కానీ ప‌రిస్థితి తారుమార‌యింది. ఎన్నికల స‌మ‌యంలో భారీగా ఖ‌ర్చు చేసేందుకు స‌రిప‌డా నగదు లేకపోవడంతో దేవ‌మ్మ స‌హా ఆమె కుటుంబ స‌భ్యులు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారు.

స‌ర్పంచ్‌ గా ఎన్నిక‌యి దాదాపు రెండేళ్లు కావస్తున్నా దేవ‌మ్మ అప్పులు తీర్చ‌డంలేదు. కొద్దికాలం వర‌కు ఓపిక ప‌ట్టిన రుణ‌దాత‌లు ఆ త‌ర్వాత అప్పులు తీర్చాలని అడ‌గ‌టం మొద‌లుపెట్టారు. స‌మ‌యం చెప్తూ వ‌చ్చినప్ప‌టికీ ప‌దే ప‌దే దాట‌వేడ‌యంతో అప్పులవాళ్లు ఒత్తిడిచేశారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై దేవ‌మ్మ నేడు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డింది. దేవ‌మ్మ మ‌ర‌ణం నేప‌థ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాజ‌కీయాలంటే మోజు ఉన్న‌ప్ప‌టికీ.. ప‌రిస్థితుల‌ను స‌రిచూసుకోకుండా...ఆర్థిక ప‌రిస్థితిని అస్స‌లే ప‌ట్టించుకోకుండా అడుగులు వేయ‌డం బాధాక‌రం. పైగా ఇలాంటి రాజ‌కీయ అప్పుల మ‌ర‌ణాలు ప‌రిస్థితి నిజంగా విచార‌క‌రం.