Begin typing your search above and press return to search.

తాగునీటిలో తొలిసారిగా 'మేఘా' యాన్యుటీ

By:  Tupaki Desk   |   22 Jan 2019 5:37 AM GMT
తాగునీటిలో తొలిసారిగా మేఘా యాన్యుటీ
X
ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వాముల కలయికతో రూపొందించే పథకమే యాన్యుటీ. ప్రజలకు అవసరం అనుకున్న ప్రాజెక్టులను నిర్మించాల్సినప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు ప్రైవేట్ కంపెనీలే పెట్టుబడిని పెట్టి పూర్తి చేసిన తర్వాత ప్రతి సంవత్సరము దశల వారీగా పెట్టుబడిని ప్రభుత్వం నుండి తిరిగి పొందడమే యాన్యుటి ప్రాజెక్టు విధానం. ఈ ప్రాజెక్టులను ఇంతకు ముందు రహదారులు - మౌళిక సదుపాయాల రంగంలో మాత్రమే చేసేవారు. కానీ మేఘా ఇంజనీరింగ్ దేశ వ్యాప్తంగా తొలిసారిగా తాగు - విద్యా రంగంలో మౌళిక సదుపాయాల కల్పన క్రింద 5 ప్రాజెక్టులను యాన్యుటీ మోడల్ క్రింద చేపట్టింది. ఇందుకోసం ఎంఈఐఎల్ మొత్తం 6000 కోట్ల రూపాయలను సొంతంగా వ్యయం చేయనుంది. యాన్యుటీ మోడల్ వివిధ రంగాలలో విఫలమైన తరువాత తాగునీటి రంగంలో చేపట్టేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాని పరిస్థితుల్లో మేఘా ధైర్యంగా ముందడుగు వేసింది. తెలంగాణలోని కేశవపూర్ రిజర్వాయర్ (హైదరాబాద్) - హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్ ఆర్ పరిసర 190 గ్రామాలకు - 5 నగర పంచాయితీలకు తాగునీరు - ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు - ప్రకాశం జిల్లాలోని 2426 పాఠశాలల నిర్మాణం - ఓడిషా రాజధాని భువనేశ్వర్ బల్క్ తాగునీటి ప్రాజెక్టులను ఎంఇఐఎల్ యాన్యుటీ మోడల్ క్రింద చేపట్టింది.

4396 కోట్ల రూపాయలతో కేశవాపూర్ రిజర్వాయర్:

హైదరాబాద్ నగరం తాగునీటి సమస్య తీర్చేందుకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ క్రింద 4396.15 కోట్ల రూపాయలను ఎంఇఐఎల్ వెచ్చిస్తున్నది. శామీర్ పేట మండలం కేశవాపూర్ వద్ద 10 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ను ఏర్పాటు చేయనున్నారు. రిజర్వాయర్తో పాటు శామీర్ పేట పరిసర గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు 750 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటు నిర్మిస్తున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ క్రింద ప్రభుత్వం 20 శాతాన్ని సమకూరిస్తే ఎంఈఐఎల్ 80 శాతాన్ని ఖర్చు చేయనుంది. మిగిలిన ఈ 80 శాతాన్ని నిర్వహణ సమయంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 36 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉండగా “మేఘా” ఇంజనీరింగ్ త్వరలో పనులు చేపట్టనుంది. యాన్యుటీ పద్ధతిలో మాత్రం మొత్తం వ్యయాన్ని సంస్థ భరించాలి. ప్రభుత్వం ఎటువంటి మొత్తాన్ని సమకూర్చదు.

నగర శివారులోకి మేఘా తాగునీరు:

628 కోట్ల ఖర్చుతో “మేఘా” ఇంజనీరింగ్ హైదరాబాద్ నగర శివారు పరిధిలోని 190 గ్రామాలకు తాగునీరు అందించేందుకు యాన్యుటీ మోడల్లో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనుంది. పని పూర్తయ్యాక రాబోయే ఏడేళ్ళ కాలంలో ఈ మొత్తాన్ని ఎంఇఐఎల్ తిరిగి ప్రభుత్వం నుండి పొందనుంది.

నగర పంచాయతీలకు తాగునీటి సరఫరా:

మిషన్ భగీరథ (అర్బన్) పథకంలో భాగంగా తెలంగాణలోని వివిధ జిల్లాలోని నగర పంచాయతీ లైన హుస్నాబాద్ - ఆంధోల్ జోగిపేట - హుజూర్ నగర్ - కోదాడ - దేవరకొండలకు తాగునీరు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును “మేఘా” ఇంజనీరింగ్ సంస్థ యాన్యుటీ విధానంలో చేపట్టింది. ఇందుకోసం ఎంఈఐఎల్ రూ.163.85 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని ఏడు సంవత్సరాల కాలంలో ఏడాదికి కొంత మొత్తం చొప్పున ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకాన్ని 15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

యాన్యుటీలో ‘మేఘా’ ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం:

ఆంధ్రప్రదేశ్‌ లోని నెల్లూరు - ప్రకాశం జిల్లాల్లో 589.72 కోట్ల విలువైన పాఠశాల భవనాల నిర్మాణ ప్రాజెక్టును సర్వశిక్ష అభియాన్‌ మేఘా సంస్థకు అప్పగించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాల్లోని 46 మండలాల్లో 1378 ప్రభుత్వ పాఠశాలలు, ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లోని 1048 ప్రభుత్వ పాఠశాలల భవనాలను మేఘా సంస్థ హైబ్రీడ్‌ యాన్యుటి పద్ధతిన నిర్మించనుంది. ప్రాజెక్టు విలువలో 60 శాతం నిధులను ఎంఈఐఎల్‌ సమకూర్చటంతో పాటు ఐదేళ్ళపాటు నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది.

భువనేశ్వర్‌ బల్క్‌ వాటర్‌...

ఒడిషా రాజధాని నగరం భువనేశ్వర్‌ చుట్టు పక్కల పురపాలక సంఘాలతో పాటు ప్రముఖ విద్యా సంస్థలకు నీటిని అందించే భువనేశ్వర్‌ బల్క్‌ వాటర్‌ సరఫరా పథకం మేఘా ఇంజనీరింగ్‌ చేపట్టింది. ఈ పథకాన్ని రూ. 187 కోట్లు ఖర్చు చేసి 2017లో మేఘా ఇంజనీరింగ్‌ విజయవంతంగా పూర్తి చేసింది. భువనేశ్వర్‌ బల్క్‌ వాటర్‌ ప్రాజెక్టును 25 ఏళ్ల పాటు మేఘా ఇంజనీరింగ్‌ నిర్వహించనుంది. ఈ పథకం ద్వారా ఎంఈఐఎల్‌ ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీ భువనేశ్వర్‌ - ఎన్‌ ఐఎస్‌ ఈఆర్‌ - పారిశ్రామిక పార్కుతో పాటు భువనేశ్వర్‌ పరిసర మున్సిపాలిటీలైన ఖోర్దా - జాట్నాకు తాగునీరు అందిస్తుంది.