Begin typing your search above and press return to search.

`అల్లు`వారి కాలేజీకి చిరు `కోటి`సాయం!

By:  Tupaki Desk   |   20 Feb 2018 2:28 PM GMT
`అల్లు`వారి కాలేజీకి చిరు `కోటి`సాయం!
X
రాజ్య‌స‌భ ఎంపీ - సినీహీరో చిరంజీవి త‌న ఉదార‌త‌ను మ‌రోసారి చాటుకున్నారు. రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీ కొత్త భ‌వ‌నం నిర్మాణం కోసం రూ.కోటి నిధులను చిరంజీవి అందించారు. ఆ కాలేజీలో కొత్త భవనం నిర్మించేందుకుగానూ తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలను చిరు మంజూరు చేశారు. చిరు నిధుల మంజూరుపై రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీ మోహ‌న్ హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి స్వగృహంలో ఆయ‌న‌ను క‌లిసి మురళీ మోహన్..పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు చెప్పారు.

సినీరంగంలో చిరుతో మురళీ మోహన్ కు మంచి అనుబంధం ఉన్న సంగ‌తి తెలిసిందే. 'మనవూరి పాండవులు' - 'గ్యాంగ్ లీడర్' వంటి హిట్ సినిమాల‌లో వీరు క‌లిసి న‌టించారు. రాజ‌కీయాల‌ప‌రంగా ఇద్ద‌రూ వేర్వేరు పార్టీల‌కు చెందిన‌వారైనా....సినీరంగానికి చెందిన కార్య‌క్ర‌మాల్లో చిరు - ముర‌ళీమోహ‌న్ క‌లిసి పాల్గొంటారు. ఇటీవ‌ల మ‌ర‌ణించిన గుండు హ‌నుమంత‌రావుకు కూడా చిరు ఆర్థిక సాయం అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే. గుండు హ‌నుమంత‌రావు అకాల మ‌ర‌ణంపై చిరు తీవ్ర ఆవేద‌న‌కు గురైన విష‌యం విదిత‌మే.