బ్లేడుతో గొంతుకోసుకున్న మెగా అభిమాని!

Wed Jan 11 2017 18:07:46 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద పరిస్థితి అప్పట్లో ఎలా ఉండేదో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంతో గ్యాప్ తర్వాత చిరు సినిమా విడుదలవుతున్నా అదే స్థాయిలో కొన్నిచోట్ల పరిస్థితి ఉందని చెప్పొచ్చు. తాజాగా బుదవారం విడుదలయిన చిరంజీవి 150వ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద ఒక అభిమాని చేసిన పని అందరికీ షాకిచ్చింది.

విశాఖపట్నంలోని రామా టాకీస్ వద్దకు ఒక అభిమాని చిరంజీవి సినిమా చూడటానికి వచ్చాడు. అయితే అతడికి టిక్కెట్ దొరకలేదు. దీంతో తీవ్ర మనోవేదనతో పాటు ఆగ్రహానికీ గురైన ఆ అభిమాని బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దీన్ని అభిమానం అనాలా లేక పిచ్చి పని అనాలా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే... ఆ సమయంలో ఈ అభిమాని మద్యం మత్తులో ఉన్నాడు! దీంతో అప్పటికే టిక్కెట్ దొరకలేదని వీరంగం ఆడుతూ ఆడుతూ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దాంతో మెడకు గాయమై రక్తమోడుతున్న అతన్ని ఆసుపత్రికి తరలించాలని థియేటర్ యాజమాన్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు.

ఇదే క్రమంలో అతనిని ఆస్పత్రికి తీసుకెల్లడానికి అక్కడున్నవారంతా ఎంత ప్రయత్నించినా అతడు అంగీకరించలేదు సరికదా... తనకు టిక్కెట్ ఇస్తేనే ఆసుపత్రికి వెళతానని లేకుంటే ఇక్కడే చచ్చిపోతానని మాట్లాడటం మొదలుపెట్టాడు! ఈ మూర్ఖపు వాదన అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆ అభిమానిని అదుపు చేసారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/