ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజగురువు అంచనా అదే?

Thu Apr 18 2019 12:12:12 GMT+0530 (IST)

తెలుగుదేశం అధినేతకు రాజగురువుగా పేరు పొందిన మీడియాధినేత ఫలితాలపై తన అంచనాలను వెల్లడించేశారట. తన మీడియా హౌస్ ద్వారా పక్కా అంచనాలను తెప్పించుకున్న ఆయన.. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓటమిని అంచనా వేస్తూ ఉన్నారట. ఇవే అంచనాలను తెలుగుదేశం అధినేతకు కూడా సదరు రాజగురువు వివరించినట్టుగా సమాచారం.ఆయన లెక్కల ప్రకారం.. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని తేలిందట. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజార్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు దాన్ని అప్పగిస్తుందని ఆయన అంచనాల్లో తేలిందట. తెలుగుదేశం పార్టీ ఆరేడు ఎంపీ సీట్లను మించి నెగ్గే అవకాశం లేదని కూడా రాజగురువు  అంచనా వేసినట్టుగా  సమాచారం!

రాష్ట్రంలో ఎలాగూ అధికారం చేజారడం ఖాయమైన నేపథ్యంలో.. ఆరేడు సీట్లతో కనీసం కేంద్రంలో అయినా ఏదో ఒకరకంగా ప్రాధాన్యతను దక్కించుకోవాలని చంద్రబాబుకు ఉద్భోదించారట రాజగురువు. ఎలాగూ కేంద్రంలో హంగ్ తరహా పరిస్థితి వచ్చేలా ఉంది. కాబట్టి..ఆరేడు ఎంపీ సీట్లతో అయినా అక్కడ ఏమైనా అవకాశం దక్కుతుందేమో అనే  ప్రయత్నాలు చేయాలని సదరు రాజగురువు బాబుకు సూచించారట.

ఏపీ వరకూ అయితే ఆశలు వదిలేసుకోవాల్సిందే - దక్కే కొద్ది పాటి ఎంపీ సీట్లతో అయినా ఏమైనా ప్రయత్నాలు సాగించాలని ఆయన వివరించారట. ఈ విధంగా ఫలితాలపై చంద్రబాబుకు క్లారిటీ ఇచ్చి - తదుపరి అనుసరించాల్సిన మార్గాన్ని సూచించారట ఆయన.

ఒకవైపు తెలుగుదేశం గెలుస్తుంది నూటా ముప్పై ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. కాదు నూటా యాభై వస్తాయని అంటూ… చంద్రబాబు నాయుడు అంటున్నా - రాజగురువు మాత్రం అలాంటి మాటలను కట్టి పెట్టి కేంద్రంలో ఏమైనా ప్రాధాన్యత దక్కే అవకాశలాను పరిశీలించుకోవాలని సూచించారట. అయినా ఆరేడు ఎంపీ సీట్లతో కేంద్రంలో అయినా ఏం ప్రాధాన్యత లభిస్తుందబ్బా?