Begin typing your search above and press return to search.

వైసీపీ గూటికి మేడా..గంజాయి వ‌నం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చా

By:  Tupaki Desk   |   22 Jan 2019 1:07 PM GMT
వైసీపీ గూటికి మేడా..గంజాయి వ‌నం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చా
X
అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. అధికార పార్టీకి షాక్ త‌గిలింది. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పార్టీకి గుడ్‌ బై చెప్పారు. లోటస్ పాండ్‌ లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ - గంజాయి వనం నుంచి తులసివనంలోకి వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. టీడీపీ అధినేత చెప్పేదొకటి చేసేదొకటి. అక్కడ నాలుగున్నర సంవత్సరాలు నరకయాతన అనుభవించానని ఆయ‌న వాపోయారు.

టీడీపీకి రాజీనామా చేసిన మేడా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసిన‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నారా చంద్రబాబు గంజాయి వనం నుంచి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తులసి వనంలోకి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ..కాంగ్రెస్‌ను ఎదురించి సొంత పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌..తన తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రజాస్వామ్య విలువలు కలిగిన వైఎస్‌ జగన్‌ లాంటి మంచి వ్యక్తి వద్దకు రావడం సొంతింటికి వచ్చినంత సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లు టీడీపీలో మెలగలేక ఆ పార్టీని వీడానన్నారు. ఈ నెల 31న వైఎస్‌ ఆర్‌ సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి - వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారన్నారు. వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్‌ ఆర్‌ సీపీలో చేరుతానని ప్రకటించారు. రేపు స్పీకర్‌ ఫార్మెట్‌ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చే విధంగా వైఎస్‌ జగన్‌ ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్ సమర్థుడని నమ్మి వైఎస్‌ ఆర్‌ సీపీలో చేరేందుకు ముందుకు వచ్చానని మేడా ప్ర‌క‌టించారు. ప్రజలకు సేవ చేసేందుకు వైఎస్‌ ఆర్‌ కుటుంబం చేస్తున్న పోరాటాలకు ఆకర్శితుడినై పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చంద్రబాబు..నిన్ను నమ్మం.. అందుకే వైఎస్‌ ఆర్‌ సీపీలో చేరుతున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది మరోకటి అని విమర్శించారు. రైతులకు - డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తానని యువత ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారిని దగా చేశారన్నారు. కాపులను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు అక్రమాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. నిన్ను నమ్మను బాబూ.. అని ప్రజలు అంటున్నారని - అలాంటి వ్యక్తి వద్ద ఉండలేనని మేడా అన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నారు. ఆయన పనికి రాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న దోపిడీని చూడలేకే టీడీపీని వీడానని సంచలన ఆరోపణలు చేశారు. రూ.800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు.

మేం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నామని, ఆయన ఏం చెబితే అది చేస్తామని మేడా అన్నారు. ఆదినారాయణ రెడ్డి అడ్డదారిలో టీడీపీలోకి వచ్చి పదవులు పొందారని, తాము అలా అడ్డదారులు తొక్కమని చెప్పారు. వైయస్ ఆశయాలకు అనుగుణంగా - జగన్ బిక్షం పెడితే గెలిచిన వ్యక్తి అన్నారు. అలాంటి ఆదినారాయణ రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీలో చేరారని చెప్పారు.