కాపులకు రిజర్వేషన్ మంజునాథ తేల్చేదెన్నడో

Sun Nov 19 2017 23:00:01 GMT+0530 (IST)

కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాధ్ కమిషన్ తమ సమగ్ర సవివరన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందన్న వార్తలు వస్తున్నాయి. కాపులను బీసీలలో చేర్చరాదని మిగిలిన బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై కాపుల బీసీ రిజర్వేషన్ ఆధారపడి ఉంది. త్వరలో ఎన్నికలు వస్తాయన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాపులను బీసీలలో చేర్చాలన్న కోరికపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎన్నికల అనంతరం నిర్ణయానికి వాయిదా వేస్తుందో అని ఉత్కంఠ నెలకొంది.టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ నిలుపుకునేందుకు కాపు తెలగ ఒంటరి బలిజ కులాలను బీసీల్లో చేర్చే ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మంజునాధ్ నేతృత్వంలోని కమిషన్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వివిధ రాజకీయ పార్టీలు బీసీ సంఘాల నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో కమిషన్ నివేదికను సిద్దం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కమిషన్ రూపొందించిన వివరాలను సంక్షిప్తం చేసి సీడీ రూపంలో ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. కాపులకు బీసీ రిజర్వేషన్ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం క మిషన్‌ను కోరినట్లు తెలుస్తోంది. దీంతో కమిషన్ కాపులకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కులాల వారీగా విచారించి విశ్లేషించి వచ్చిన వినతులపై ప్రత్యేకంగా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. కాపులకు బీసీ రిజర్వేషన్ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతోపాటు ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ను కోరినట్లు తెలుస్తోంది. దీంతో కమిషన్ కాపులకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కులాల వారీగా విచారించి విశ్లేషించి వచ్చి న వినతులపై ప్రత్యేకంగా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా కాపు - తెలగ - ఒంటరి - బలిజ కులస్థుల నుంచి వచ్చిన వినతులు - కాపు సంఘాల నుంచి వచ్చిన వినతులతోపాటు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాసాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తూ కమిషన్ నివేదికకు తుదిమెరుగులు దిద్దే ప్రయత్నంలో ఉంది. అన్ని జిల్లాల్లో కాపు - తెలగ - ఒంటరి - బలిజ కులాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని క్రోఢీకరించి ఆయా చోట్ల ఎంతమంది కాపులు ఉన్నారు ముఖ్యంగా కాపులకు సంబంధించి వారి జీవన స్థితిగతులు - ఆర్థిక స్తోమత - విద్య - ఉద్యోగం - భూములు - కుటుంబసభ్యులు - కుల చరిత్ర - తదితర అంశాలను కమిషన్ క్షేత్రస్థాయిలో సేకరించింది. వాటి ఆధా రంగానే ప్రత్యేక నివేదిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే కాకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కమిషన్ నివేదికను తయారు చేసిందని అంటున్నారు. కాపుల కంటే తెలగ - ఒంటరి - బలిజ కులస్థులు సమాజంలో వెనుకబడి ఉన్న ట్లు కమిషన్ గ్రహించిందంటున్నారు. కాపులు విద్య ఉద్యోగ రంగాల్లోను ఆర్థికంగా మెరుగ్గా ఉన్నట్లు బీసీ సంఘాలు కూడా కమిషన్ తెచ్చిన వినతులలో పేర్కొ న్నాయి. కమిషన్ కూడా ఈ విషయంపై క్షేత్రస్థాయిలో మరింత లోతుగా అధ్యయనం చేసింది. తనకు కావాల్సిన సమాచారాన్ని 90 శాతానికిపైగా కమీషన్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాసాధికార సర్వే వివరాల ద్వారా సేకరించింది.

రాష్ట్రంలో 390కు పైగా వివిధ కులాలు ఉండగా అందులో 139 దాకా బీసీ కులాలు ఉన్నాయి. కమిషన్ ఈ కులాలకు సంబంధించిన వారిని క్షేత్రస్థాయిలో కలిసి వారి ఆవేదనను స్వీకరించింది. అలాగే 62 కులాల సంఘాల వారు తమ కులాల గ్రూపులను మార్చాలంటూ కమిషన్ కు నివేదించారు. వీరి అభ్యర్థనపై కూడా కమిషన్ ప్రత్యేక నివేదికలు రూపొందించిందంటున్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం - శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో కాపులు ఇప్పటికే బీసీల జాబితాలో కొనసాగుతున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా కమిషన్ రికార్డు చేసింది. వారిని బీసీలలోకి చేర్చకముందు ఉన్న స్థితిగతులు అనంతరం పరిస్థితులపై కూడా కమిషన్ లోతుగా అధ్యయనం చేసి పొందుపరిచినట్లు సమాచారం. అలాగే కృష్ణా తూర్పుగోదావరి జిల్లాలలో ఒంటరి కులస్థులు రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో బలిజ కులస్థులు అధికసంఖ్యలో ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. వారి ఆర్థిక - సామాజిక - రాజకీయ సాంస్కృతిక అంశాలను ఈ సందర్భంగా కమిషన్ విచారించింది. మిగిలిన బీసీ కులాల నుంచి గ్రూపుల మార్పు - ఇతర అంశాలపై కూడా కమిషన్ ప్రత్యేక నివేదికలు తయారుచేసింది. అయితే ఈ నివేదికలను ఎప్పుడు బహిర్గతం చేస్తారు? రిజర్వేషన్ ఎప్పుడు అమలు చేస్తారనేది ఆసక్తిగా మారిందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.