Begin typing your search above and press return to search.

సామాన్యుల‌ను దాటి వెళ్లి ఓటేసిన గ‌వ‌ర్న‌ర్.. సీఎం

By:  Tupaki Desk   |   18 April 2019 11:41 AM GMT
సామాన్యుల‌ను దాటి వెళ్లి ఓటేసిన గ‌వ‌ర్న‌ర్.. సీఎం
X
కొన్నిచోట్ల వీఐపీల‌కు స్పెష‌ల్ ట్రీట్ మెంట్ ఉంటుంది. కానీ.. ఓటేసేందుకు అంద‌రూ క్యూ ప‌ద్ద‌తినే అనుస‌రించాలి. కానీ.. అందుకు భిన్నంగా తాము ఇ స్పెష‌ల్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన కొంద‌రు ప్ర‌ముఖుల‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. గ‌తంలో పోలిస్తే వ‌ర్త‌మానంలో.. ప్ర‌ముఖులు ప‌లువురు తాము మిగిలిన వారి కంటే ప్ర‌త్యేక‌మ‌న్న తీరుకు పుల్ స్టాప్ పెట్టేసి.. ప్ర‌జ‌లంద‌రితో క‌లిసి క్యూలో నిలుచొని ఓటు వేస్తున్న వైనం ఒక ప‌క్క క‌నిపిస్తున్నా.. కొన్ని చోట్ల మాత్రం ప్ర‌ముఖుల‌మ‌న్న ప్ర‌త్యేక భావ‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. తాజాగా అలాంటిదే మ‌ణిపూర్ లోచోటు చేసుకుంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల రెండో ద‌శ పోలింగ్ ఈ రోజు ఉద‌యం నుంచి ప్రారంభం కావటం తెలిసిందే. దాదాపు 96 స్థానాల‌కు ఈ రోజు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా మ‌ణిపూర్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ జ‌రుగుతోంది. స‌గోల్ బంద్ ప్రాంతంలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వ‌చ్చిన ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌జ్మా హెప్తుల్లా క్యూలైన్లో ఓటు వేసేందుకు నిల‌వ‌కుండా.. నేరుగా లోప‌ల‌కు వెళ్లి ఓటేశారు.

గ‌వ‌ర్న‌ర్ మాత్ర‌మే కాదు.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బీరెన్ సింగ్ కూడా త‌న భార్య‌తో క‌లిసి వ‌చ్చి.. క్యూ లైన్లో నిలుచోకుండా.. సామాన్యుల్ని దాటేసుకొని వెళ్లి త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. గ‌వ‌ర్న‌ర్.. ముఖ్య‌మంత్రులు త‌మ‌ను దాటేసుకొని వెళ్లి ఓటు వేయ‌టాన్ని మ‌ణిపూర్ ప్ర‌జ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదు కానీ.. త‌మ‌తో క‌లిసి ఓటు వేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్నివ్య‌క్తం చేశారు. ప్ర‌ముఖుల్లో క‌నిపించ‌ని గుణాన్ని త‌మ మాట‌ల్లో చెప్ప‌క‌నే చెప్పేయ‌టం గ‌మ‌నార్హం.