Begin typing your search above and press return to search.

మేనిఫేస్టోలకు వేళాయేరా...!

By:  Tupaki Desk   |   23 Sep 2018 6:36 AM GMT
మేనిఫేస్టోలకు వేళాయేరా...!
X
ముందస్తకు ఒక్కొక్కటి సిద్దం అవుతున్నాయి. అభ్యర్దుల ఎంపిక ఒకవైపు ప్రచార సన్నాహాలు ఒకవైపు........అలకలు బుజ్జగింపులు..... మరోవైపు...... ఇలా ఎన్నికల వేడి రాజుకుంటోంది. తమకు అధికారం ఇస్తే ఏమేమి చేస్తామో వివరించేందుకు అన్నీ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సినీయర్ నాయకుడు కె. కేశవరావు అధ్వర్యంలో మేనీఫేస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షుడిగా మేనిఫేస్టో కమిటీని ప్రకటించింది. ఇక తెలంగాణ జన సమితి - తెలుగుదేశం పార్టీ - వామపక్షాలు - తమ మేనిఫేస్టోలను సిద్దం చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు - ఓట్లు రాబట్టుకునేందుకు మేనిఫేస్టోలో వరాల జల్లులు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 10న గాని - 12న గాని తన మేనిఫేస్టోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తమ మేనిఫేస్టో " పీపుల్స్ మేనిఫేస్టో " గా ఉంటుంది చెబుతున్నారు. మేనిఫేస్టో ఎలా ఉండాలో సలహాలు సంప్రదింపుల కోసం ఏకంగా ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో వ్యవసాయ రంగం - సంక్షేమం - పారిశ్రామిక విధానం - మైనారీటిల సమస్యలు - విద్యా - ఆర్దిక రంగం - రవాణ - సింగరేణి వంటి కీలక రంగాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇక ఎవరైన సలహాలు - సూచనలు చేయాలంటే ఫేస్‌ బుక్ - ద్వారా గాని - ఈ-మెయిల్ ద్వారా గాని తమను సంప్రదించ వచ్చు అని అన్నారు. ఇందుకోసం ఫేస్ బుక్‌ లో కాంగ్రెస్ మేనిఫేస్టో అని, కాంగ్రెస్‌ మేనిఫేస్టో @ జీ మెయిల్. కామ్ ఖాతాలను కూడా తెరిచారు.

ఇదిలా ఉండగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫేస్టో కోసం సమావేశాలు నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన పనులు సంక్షేమ కార్యక్రమాలు ఒక వైపు చెబుతూనే, మరో వైపు కొత్త కార్యక్రమాలను కూడా మేనిఫేస్టోలో ఉంచాలని నిర్ణయించారు. తామూ చేసిన అభివ్రుద్దే తమను తిరిగి అధికారంలోకి తీసుకుని వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ధీమగా ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ మేనిఫేస్టోపై ఏలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించటం లేదు. మహాకూటమిలో భాగస్వామ్య పార్టీ కావడంతో సీట్లు సర్దుబాటు తర్వాత మేనిఫేస్టోపై ద్రుష్టి పెట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రతి అంశానికి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని సంప్రదించే తెలంగాణ తెలుగుదేశం నాయకుడు అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ జన సమితి మేధావులతో సమవేశమై మేనిఫేస్టో రూపకల్పనకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. మొత్తానికి అన్ని పార్టీలు తమ మేనిఫేస్టోల రూపకల్పనకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి.